Breaking News

6000 మంది ఉద్యోగుల తొలగింపు అందుకే: సత్య నాదెళ్ళ

Published on Sat, 05/31/2025 - 18:03

మైక్రోసాఫ్ట్ ఇటీవల దాదాపు 6,000 మంది ఉద్యోగులను, అంటే దాని ప్రపంచ శ్రామిక శక్తిలో దాదాపు 3 శాతం మందిని తొలగించింది.. అసలు కంపెనీ ఇంతమందిని ఎందుకు తొలగించింది అనే విషయాన్ని సీఈఓ సత్యనాదెళ్ళ వివరించారు.

ఇటీవల ఉద్యోగులతో జరిగిన టౌన్ హాల్‌ సమావేశంలో సత్యనాదెళ్ళ మాట్లాడుతూ.. ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం పనితీరు సరిగ్గా లేకపోవడం కాదు. సంస్థ పునర్వ్యవస్తీకరణలో భాగంగానే ఉద్యోగుల తొలగింపులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

పోటీ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ తన కోపైలెట్ ఏఐ అసిస్టెంట్‌లను మరింత వేగంగా వినియోగదారులకు చేర్చడం మీద కూడా దృష్టి సారించింది. దీనికోసం కొన్ని సంస్థలతో.. ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. ఏఐ టూల్స్ వాడకం మాత్రమే కాకుండా.. ఇందులో ఉద్యోగులకు సైతం శిక్షణ ఇవ్వాల్సిన ఉందని సత్యనాదెళ్ళ వివరించారు.

మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం ఏఐ మౌలిక సదుపాయాలలో 80 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇందులో ఏఐ సామర్థ్యాలను విస్తరించడం మాత్రమే కాకుండా.. వివిధ ప్లాట్‌ఫామ్‌లు, సేవలలో దాని కోపైలట్ ఏఐ అసిస్టెంట్‌లను ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి.

ఇదీ చదవండి: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం: చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా

మైక్రోసాఫ్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ 'అపర్ణ చెన్నప్రగడ' కూడా ఇదే కార్యక్రమంలో పాల్గొన్నారు. కోడింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ అధ్యయనం వాడుకలో లేకుండా పోతుందనే ఆలోచనలను గురించి మాట్లాడుతూ.. "కంప్యూటర్ సైన్స్ చదవకూడదనే లేదా కోడింగ్ చనిపోయిందనే భావన ఏ మాత్రం సరైంది కాదు, ఇందులో ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేదని.. భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆమె భరోసా ఇచ్చారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)