రియల్‌ ఎస్టేట్‌ ఆఖరి ఆరు నెలలూ సానుకూలం

Published on Sun, 12/01/2024 - 09:06

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో (2023 అక్టోబర్‌ నుంచి 2024 మార్చి వరకు) సానుకూల పనితీరు చూపించనుంది. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంపై రియల్‌ ఎస్టేట్‌ సెంటిమెంట్‌ ఇండెక్స్‌ను నైట్‌ఫ్రాంక్, నరెడ్కో సంయుక్తంగా విడుదల చేశాయి.

ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌కు సెంటిమెంట్‌ స్కోరు 65గా ఉంటే, జూలై–సెప్టెంబర్‌లో 64కు తగ్గింది. అయితే భవిష్యత్‌ సెంటిమెంట్‌ స్కోర్‌ మాత్రం 65 నుంచి 67కు పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో రియల్టీ పరిశ్రమ వృద్ధి పట్ల ఉన్న విశ్వాసాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నైట్‌ఫ్రాంక్, నరెడ్కో నివేదిక తెలిపింది. రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమకు సంబంధించి సరఫరా వైపు భాగస్వాములు, ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్ల అంచనాలు, ఆర్థిక వాతావరణం, నిధుల లభ్యతను ఈ సూచీ తెలియజేస్తుంది.

స్కోర్‌ 50గా ఉంటే తటస్థంగా, 50కి పైన సానుకూలంగా, 50కి దిగువన ప్రతికూల ధోరణిని ప్రతిఫలిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రస్తుత, భవిష్యత్‌ సెంటిమెంట్‌ రెండూ సానుకూల శ్రేణిలోనే ఉన్నట్టు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయని, పరిశ్రమ దీర్ఘకాల సామర్థ్యాలపై స్థిరమైన విశ్వాసానికి నిదర్శనమని నివేదిక పేర్కొంది.  

ఇళ్ల మార్కెట్లోనూ సానుకూలత: ఇళ్ల మార్కెట్‌లో భవిష్యత్‌ సెంటిమెంట్‌ సానుకూలంగా నమోదైంది. ధరలు పెరుగుతాయని 62 శాతం మంది అంచనా వేస్తుంటే, అమ్మకాలు పెరుగుతాయని 40 శాతం మంది భాగస్వాములు అంచనా వేస్తున్నారు. 38 శాతం మంది మార్కెట్‌ స్థిరంగా ఉంటుందని భాస్తున్నారు. ఆఫీస్‌ మార్కెట్‌లో లీజింగ్, సరఫరా, అద్దెల పరంగా బలమైన సానుకూలత కనిపించింది. రానున్న నెలల్లో ఆఫీస్‌ మార్కెట్‌ బలమైన పనితీరు చూపిస్తుందన్న అంచనాలున్నట్టు నివేదిక తెలిపింది.

అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ బలంగా ఉండడడాన్ని సెంటిమెంట్‌ సూచీ తెలియజేస్తోందని నరెడ్కో ప్రెసిడెంట్‌ హరిబాబు పేర్కొన్నారు. ‘‘2024–25 సంవత్సరానికి జీడీపీ 7.2 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ చెబుతోంది. స్థిరమైన వడ్డీ రేట్లతో ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ మరింత బలపడుతుంది. స్థిరమైన వృద్ధికి గాను ఈ రంగం సవాళ్లను పరిష్కరించుకుని, అవకాశాలు అందిపుచ్చుకోవాలి’’అని వివరించారు.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)