మూడేళ్ళలో 15 రెట్లు.. అక్కడ దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ మార్కెట్

Published on Fri, 11/08/2024 - 20:23

దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా దూసుకెళ్తోంది. గత మూడేళ్లలో అయోధ్యలో భూముల ధరలు 15 రెట్లు పెరిగాయని 'హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' (HoABL) చైర్మన్ 'అభినందన్ లోధా' అన్నారు.

ఒక ప్రముఖ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభినందన్ లోధా మాట్లాడుతూ.. 2021లో అయోధ్యలో భూమిని కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు చెప్పారు. అప్పట్లో ఒక ఎకరా భూమి ధర రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షలు మధ్య ఉండేది. కానీ ప్రాంతాన్ని బట్టి నేడు అయోధ్యలో ఎకరం భూమి ధర రూ. 5 కోట్లు వరకు ఉందని ఆయన అన్నారు.

2021లో కొనుగోలు చేసిన భూమిని మేము ఈ ఏడాది విక్రయించడం ప్రారంభించాము. 7 నెలల్లో 1400 ప్లాట్లను విక్రయించాము. మేము ఈ సంవత్సరం చివరగా అమ్మిన భూమి చదరపు గజం విలువ రూ. 15,000. మా సంస్థ మొత్తం 1400 రైతుల దగ్గర నుంచి ఇప్పటికే 51 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని అభినందన్ లోధా పేర్కొన్నాడు.

పవిత్ర నగరమైన అయోధ్యలో భూముల విక్రయం మాత్రమే కాకుండా.. 6,000 చెట్లను నాటడం, 30కి పైగా స్థానిక జాతులను సంరక్షించడం, 1000 చెట్లను పెంచడం వంటివి కూడా చేసినట్లు లోధా చెప్పారు.

ఇదీ చదవండి: 38 ఏళ్ల వయసు.. 120 కోట్ల విరాళం: ఎవరో తెలుసా?

ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా అయోధ్యలో 15000 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశారు. అయోధ్య ఇప్పుడు మతపరమైన నగరంగా మారిన తరువాత.. వారణాసి, బృందావన్‌లలో ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు లోధా ప్రకటించారు. ముంబైకి సమీపంలోని అమృత్‌సర్, బృందావన్, వారణాసి, సిమ్లా, నాగ్‌పూర్, ఖోపోలీలో 352 ఎకరాలు భూసేకరణను ఇటీవలే ముగించినట్లు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)