Breaking News

రియల్టీలో తగ్గనున్న సంస్థాగత పెట్టుబడులు 

Published on Sun, 06/29/2025 - 06:32

న్యూఢిల్లీ: దేశ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో సంస్థాగత (ఇనిస్టిట్యూషన్స్‌) పెట్టుబడులు ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్‌) 37 శాతం తక్కువగా 3.06 బిలియన్‌ డాలర్లు (రూ.26,300 కోట్లు)గా ఉండొచ్చని ఈ రంగానికి చెందిన కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. ఇందులో హౌసింగ్‌ ప్రాజెక్టుల వాటా 38 శాతం ఉంటుందని అంచనా వేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశి్చతులు, ఆర్థిక సవాళ్లు నెలకొనడాన్ని కారణంగా పేర్కొంది. దీంతో పెట్టుబడుల లావాదేవీల గడువు పొడిగింపునకు గురవుతున్నట్టు వివరించింది. 

క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో రియల్‌ ఎస్టేట్‌లో ఇనిస్టిట్యూషన్స్‌ 4.89 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసినట్టు జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక తెలిపింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో.. విదేశీ ఇన్వెస్టర్ల వాటా 68 శాతంగా ఉంటే, దేశీ ఇనిస్టిట్యూషన్స్‌ మిగిలిన 32 శాతం వాటాను ఆక్రమించినట్టు పేర్కొంది. రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌లు (రీట్‌ లు), క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషన్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీలు), లిస్టెడ్‌ సంస్థల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతున్నట్టు జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.  

పెట్టుబడులకు ఆకర్షణీయం.. 
‘‘భారత రియల్‌ ఎస్టేట్‌ రంగం ఇప్పటికీ పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది మొదటి 6 నెలల్లో సవాళ్లు నెలకొన్నప్పటికీ దేశీ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం కొనసాగింది’’అని జేఎల్‌ఎల్‌ ఇండియా క్యాపిటల్‌ మార్కెట్స్‌ హెడ్‌ లతా పిళ్లై తెలిపారు. గత 5  ఏళ్లుగా రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు 5 బిలియన్‌ డాలర్లకు మించి నమోదవుతున్నట్టు గుర్తు చేశారు. ఈ ఏడాది దీనికి అనుగుణంగానే ఉండొచ్చన్నారు.   
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)