Breaking News

రామ జన్మభూమిలో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌.. భారీగా పెరిగిన భూముల ధరలు

Published on Sat, 01/06/2024 - 21:11

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 22వ తేదీన రామ మందిరం ప్రారంభోత్సవం కన్నుల పండువలా జరగనుంది. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచే అందరి దృష్టి అయోధ్యపై పడింది. 

సర్వత్రా ఆసక్తి
రామ మందిర నిర్మాణం కారణంగా అయోధ్య నగరంలో రియల్‌ ఎస్టేట్‌ ఊపందుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే అయోధ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. భూముల ధరలు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ ధరలు మరింత పెరుగుతాయని ప్రాపర్టీ మార్కెట్ నిపుణుల అభిప్రాయపడుతున్నారు. స్థానికులే కాకుండా బయటివారు కూడా ఇక్కడ భూములు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తాజ్,  రాడిసన్ వంటి ప్రముఖ హోటల్ చైన్‌లు ఈ ప్రాంతంలో భూమి కొనేందుకు ఆసక్తిని కనబరిచాయి.

శివార్లలోనూ భూముల ధరలకు రెక్కలు
అయోధ్యలోని రామ మందిరం ప్రాంతంలోనే కాకుండా శివార్లలోనూ భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. ఫైజాబాద్ రోడ్ ప్రాంతంలో 2019లో చదరపు అడుగుకు రూ. 400–700 ఉంటే 2023 అక్టోబర్ నాటికి రూ. 1,500–3,000కి భూమి ధరలు పెరిగాయి. ఇక అయోధ్య నగరంలో భూమి సగటు  ధరలు 2019లో చదరపు అడుగుకు రూ. 1,000–2,000 ఉండగా ప్రస్తుతం రూ. 4,000–6,000లకు పెరిగినట్లు అనరాక్‌ అధ్యయనాన్ని ఉటంకిస్తూ ‘మనీకంట్రోల్’ పేర్కొంది.

అభినందన్ లోధా హౌస్ ఈ జనవరిలోనే అయోధ్యలో 25 ఎకరాల రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. అలాగే రాడిసన్, తాజ్ వంటి ప్రముఖ హోటల్ చైన్‌లు కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాయి.

ఆధ్యాత్మికగా కేంద్రంగా అయోధ్య
రామ మందిరం ప్రారంభమయ్యాక అయోధ్య దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మికగా కేంద్రంగా, పుణ్యక్షేత్రంగా ఆవిర్భంచబోతోంది. దేశ నలుమూలల నుంచి భక్తులు, యాత్రికుల తాకిడి అధికంగా ఉండబోతోంది. ఇందుకు అనుగుణంగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య నగరంతోపాటు చుట్టపక్కల ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ ప్రాధాన్యం పెరిగింది. ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోధ్య నగరాన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అత్యంత లాభదాయకమైన గమ్యస్థానంగా చూస్తున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)