Breaking News

యువతకు ఆర్బీఐ బంపర్‌ ఆఫర్‌!

Published on Wed, 06/17/2026 - 08:18

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) యువ ప్రతిభను ఆకర్షించేందుకు ‘యంగ్‌ ప్రొఫెషనల్స్‌ (YP)’ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ, పబ్లిక్‌ పాలసీ, డేటా విశ్లేషణ, సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు అరుదైన అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.5 లక్షల స్థిర స్టైఫండ్‌ లభించనుండగా, నియామకం ఒప్పంద ప్రాతిపదికన ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు ముంబైలోని ఆర్బీఐ సెంట్రల్‌ ఆఫీస్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ఆర్బీఐ ప్రణాళిక ప్రకారం ప్రారంభంలో మూడేళ్ల కాలానికి నియామకం చేపడతారు. పనితీరు, పరస్పర అంగీకారం ఆధారంగా ఈ గడువును గరిష్ఠంగా ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. అయితే ఈ నియామకం శాశ్వత ఉద్యోగానికి హామీ కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కానీ, ఎంపికైన అభ్యర్థులు ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులుగా పనిచేయాల్సి ఉంటుంది. బ్యాంక్‌ అనుమతి లేకుండా ఇతర  ఉద్యోగాలు లేదా కన్సల్టెన్సీ పనులు చేపట్టరాదు.

ఎంపికైన యంగ్‌ ప్రొఫెషనల్స్‌కు నెలకు రూ.1,50,000 స్థిర స్టైఫండ్‌ చెల్లిస్తారు. దీనిపై వర్తించే ఆదాయపన్ను మినహాయింపులు అమల్లో ఉంటాయి. స్టైఫండ్‌కు అదనంగా ఇతర అలవెన్సులు, హెచ్‌ఆర్‌ఏ లేదా ప్రోత్సాహకాలు ఉండవని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

అభ్యర్థుల ఎంపిక వివిధ దశల్లో జరుగుతుంది. ముందుగా దరఖాస్తుల పరిశీలన, షార్ట్‌లిస్టింగ్‌ నిర్వహించి, అనంతరం డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేపడతారు. ఖాళీల సంఖ్య, దరఖాస్తుల నాణ్యత ఆధారంగా ఇంటర్వ్యూకు పిలిచే అభ్యర్థుల సంఖ్యను పరిమితం చేసే అధికారం ఆర్బీఐకి ఉంటుంది.

ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, సీవీ, విద్యార్హత సర్టిఫికెట్లు, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌, రైటింగ్‌ శాంపిల్‌, రిఫరెన్స్‌ లెటర్‌తో కలిసి ఈ-మెయిల్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. “YP Application – Post Code – Candidate Name” అనే సబ్జెక్ట్‌ లైన్‌తో [yphrmdco@rbi.org.in](mailto:yphrmdco@rbi.org.in) కు దరఖాస్తులు పంపాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే వారు ప్రతి పోస్టుకు ప్రత్యేక ఈ-మెయిల్‌ పంపాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం దరఖాస్తుల చివరి తేదీ జూలై 6, 2026గా అధికారిక ప్రకటనల్లో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని ఆర్బీఐ సూచించింది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)