Breaking News

ఆర్‌బీఐ కీలక వడ్డీ రేటు తగ్గింపు?

Published on Fri, 11/28/2025 - 15:00

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ 5న జరగబోయే మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి చేర్చే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఆహార ధరల పతనం, ఇటీవల వినియోగ వస్తువులపై ప్రకటించిన పన్ను తగ్గింపుల కారణంగా ద్రవ్యోల్బణం రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. దాంతో వినియోగానికి మద్దతు ఇవ్వడానికి ఆర్‌బీఐ రేటు తగ్గిస్తుందని భావిస్తున్నారు.

రికార్డు కనిష్టానికి ద్రవ్యోల్బణం

అక్టోబర్‌లో భారతదేశ వినియోగదారుల ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 0.25%కి చేరుకుంది. ఇది సెంట్రల్ బ్యాంక్‌కు రేట్ల తగ్గింపునకు అవకాశం ఇస్తుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 89.49 వద్ద కొత్త కనిష్టాన్ని తాకినప్పటికీ, దేశీయంగా బలహీనపడుతున్న డిమాండ్‌ను పెంచేందుకు ఆర్‌బీఐ మొగ్గు చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన ఆర్థిక గణాంకాలు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఇంకా ఉందని సూచించాయని పేర్కొన్నారు. ఏడాది మొదటి అర్ధభాగంలో 100 బేసిస్ పాయింట్ల కోత తర్వాత ఆర్‌బీఐ ఆగస్టు నుంచి రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది.

ఆర్థికవేత్తల అంచనాలు

నవంబర్ 18-26 మధ్య నిర్వహించిన రాయిటర్స్ పోల్‌లో 18 మంది ఆర్థికవేత్తలు ఆర్‌బీఐ తన డిసెంబర్ 3-5 పాలసీ సమావేశం ముగిసే సమయానికి రెపో రేటును 5.25 శాతానికి తగ్గిస్తుందని అంచనా వేశారు. మరో 18 మంది మాత్రం ఎలాంటి మార్పు ఉండదని భావించారు. డ్యూయిష్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ దాస్ మాట్లాడుతూ ‘2025-2026 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ అంచనాను మరింత సవరించే అవకాశం ఉన్నందున 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు ఉంటుందనే అంచనాలున్నాయి’ అన్నారు.

ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి?

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు