Breaking News

కేంద్రానికి బంపర్‌ బొనాంజా 

Published on Sat, 05/24/2025 - 04:27

ముంబై: గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) గాను కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్‌ బ్యాంక్‌ రికార్డు స్థాయిలో రూ. 2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2023–24) చెల్లించిన రూ. 2.1 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 27.4 శాతం అధికం. 2022–23లో ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ. 87,416 కోట్ల డివిడెండ్‌ చెల్లించింది. 

‘రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సారథ్యంలో జరిగిన 616వ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశంలో రూ. 2,68,590.07 కోట్ల మిగులును కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు‘ అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల వేళ రక్షణ శాఖకు కేటాయింపులు భారీగా పెంచాల్సి రావడం,  అమెరికా టారిఫ్‌లపరంగా నెలకొన్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వానికి ఇది సహాయకరంగా ఉండనుంది. 

ఆర్‌బీఐ ఏటా తన పెట్టుబడులపై వచ్చే అదనపు రాబడిని, డాలర్‌ మారకంలో మార్పుల వల్ల వచ్చే ప్రయోజనాలు మొదలైన వాటిని ప్రభుత్వానికి డివిడెండ్‌ రూపంలో బదలాయిస్తుంది. ఈసారి ఇది రూ. 2.5 – రూ. 3 లక్షల కోట్ల స్థాయిలో ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. తాజా బడ్జెట్‌లో అంచనా వేసిన దానికంటే ఆర్‌బీఐ ప్రకటించిన డివిడెండు సుమారు రూ. 0.4–0.5 లక్షల కోట్లు అధికమని, పన్ను వసూళ్లు లేక డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాలను సాధించలేకపోయినా, లేదా లెక్కకు మించి వ్యయాలు ఎదురైనా అధిగమించేందుకు ఇది సహాయపడగలదని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా చీఫ్‌ ఎకానమిస్ట్‌ అదితి నాయర్‌ తెలిపారు.  

రిస్క్‌ బఫర్‌ 7.50 శాతానికి పెంపు.. 
అంతర్జాతీయ, దేశీ పరిస్థితులు, రిసు్కలు మొదలైన అంశాలను సమావేశంలో సమీక్షించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. అలాగే, గత ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌ బ్యాంక్‌ పనితీరును కూడా సమీక్షించి వార్షిక నివేదికకు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. ఆర్థిక అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన కంటింజెంట్‌ రిస్క్‌ బఫర్‌ని (సీఆర్‌బీ) ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీటులో 7.50 శాతానికి పెంచాలని సెంట్రల్‌ బోర్డ్‌ నిర్ణయించింది. 2023–24లో దీన్ని 6.5 శాతానికి పెంచారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)