Breaking News

చనిపోయినవారి బ్యాంకు అకౌంట్లపై కీలక నిర్ణయం

Published on Wed, 08/06/2025 - 19:51

మరణించిన ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు, సేఫ్‌ డిపాజిట్ లాకర్లకు సంబంధించిన క్లెయిమ్‌ సెటిల్మెంట్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సెటిల్మెంట్ ప్రక్రియను ప్రామాణీకరించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ప్రకటన చేశారు.

చనిపోయినవారి బ్యాంకు ఖాతాలలో ఉన్న సొమ్ము, విలువైన వస్తువులను నామినీలకు లేదా చట్టబద్ధమైన వారసులకు అప్పగించడంలో వివిధ బ్యాంకుల్లో భిన్న ప్రక్రియలను అనుసరిస్తున్నారు. దీంతో క్లయిమ్‌ సెటిల్మెంట్‌లో ఇబ్బందులు, తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. బ్యాంకులు అనుసరించే ఈ ప్రక్రియలలో ఏకరూపతను తీసుకురావడమే ఈ చర్య లక్ష్యం.

రూ .67,000 కోట్లకుపైగా అన్‌క్లెయిమ్‌ డిపాజిట్లు
బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. జూలై 28న పార్లమెంటులో సమర్పించిన ప్రభుత్వ డేటా ప్రకారం, భారతీయ బ్యాంకులు జూన్ 30, 2025 నాటికి రూ .67,000 కోట్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లను ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ) నిధికి బదిలీ చేశాయి.

క్లెయిమ్ చేయని మొత్తం డిపాజిట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ.58,330.26 కోట్లు. ఇందులో ఎస్‌బీఐ రూ.19,329.92 కోట్లతో  అగ్రస్థానంలో ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.6,910.67 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.6,278.14 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.2,063.45 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.1,609.56 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.1,360.16 కోట్లు అన్‌క్లయిమ్‌ డిపాజిట్లు ఉన్నాయి.

ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 ఏళ్ల పాటు ఇనాక్టివ్ గా ఉన్న సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు, అదేవిధంగా మెచ్యూరిటీ తర్వాత 10 ఏళ్లపాటు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను డీఈఏ ఫండ్ కు బదిలీ చేస్తారు.

కాగా పాలసీ రెపో రేటును యథాతథంగా 5.5 శాతంగా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. అంతర్జాతీయ టారిఫ్ అనిశ్చితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రేటును యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)