వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
ఎగుమతిదారులకు ఆర్బీఐ షాక్
Published on Sat, 09/26/2026 - 08:37
దేశీయ విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) నిల్వలను బలోపేతం చేయడం, రూపాయి విలువను స్థిరీకరించడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చర్యలు చేపట్టింది. ఎగుమతి చేసిన వస్తువులు, సేవల నిధులను (ఎక్స్పోర్ట్ ప్రొసీడ్స్) తిరిగి దేశానికి తీసుకురావడానికి ఉన్న సమయ పరిమితిని ఆర్బీఐ తగ్గించింది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నూతన నిబంధనల ప్రకారం ఈ కొత్త గడువు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది.
ప్రధాన మార్పులు
ఇప్పటివరకు ఎగుమతిదారులు తమ ఎగుమతుల ద్వారా వచ్చే నిధులను పొందేందుకు 15 నెలల సమయం ఉండగా దాన్ని ఇప్పుడు 9 నెలలకు కుదించారు. ప్రత్యేక పరిస్థితుల్లో పొడిగించే గడువును కూడా 18 నెలల నుంచి 12 నెలలకు తగ్గించారు. ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం, వస్తువులు లేదా సేవలు ఎగుమతి చేసిన 9 నెలలలోపే ఆ మొత్తాన్ని ఆథరైజ్డ్ డీలర్ (ఏడీ) బ్యాంకుల ద్వారా భారత్‌కు తీసుకురావడం నిబంధనల ప్రకారం తప్పనిసరి.
నిర్ణయం వెనుక కారణాలు
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల వేళ ఎగుమతి ఆదాయం త్వరగా దేశంలోకి ప్రవేశించడం వల్ల ఫారెక్స్ నిల్వలు పెరిగి విదేశీ మారక మార్కెట్లో రూపాయిపై ఒత్తిడి తగ్గుతుంది. పాత/నిలిచిపోయిన లావాదేవీల (లెగసీ ట్రాన్సాక్షన్స్) ఆమోద ప్రక్రియను ఆథరైజ్డ్ డీలర్ బ్యాంకులకు బదిలీ చేయడం ద్వారా పరిపాలనాపరమైన జాప్యాన్ని నివారించినట్లవుతుంది.
పరిశ్రమలపై ప్రభావం
ఆర్బీఐ తాజా చర్య వల్ల దేశీయ వర్కింగ్ క్యాపిటల్ వ్యాపారాలపై, ప్రత్యేకించి చిన్న, మధ్యతరహా ఎగుమతిదారులపై స్వల్పకాలిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఎగుమతిదారులు తమ విదేశీ కస్టమర్లతో బిల్లింగ్ విధానాలను, పేమెంట్ సైకిల్స్‌ను కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. గడువు దాటితే ఫెమా చట్టం కింద జరిమానాలు ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో వ్యాపార సంస్థలు తమ నగదు ప్రవాహాలను మరింత కచ్చితత్వంతో నిర్వహించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ఇదీ చదవండి: ఆధార్ వ్యవస్థనే అబ్బురపరిచిన కవలలు
Tags : 1