Breaking News

మరోసారి ‘శక్తి’మంతుడైన ఆర్బీఐ గవర్నర్‌!

Published on Sun, 10/27/2024 - 11:48

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి A+ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా ఘనత సాధించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా టాప్ సెంట్రల్ బ్యాంకర్‌గా ర్యాంక్ పొందారు. శక్తికాంత దాస్ ఈ అవార్డును గెలుచుకోవడం ఇది వరుసగా రెండో సంవత్సరం.

A+ రేటింగ్ పొందిన ముగ్గురు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌ల జాబితాలో శక్తికాంత దాస్‌ అగ్రస్థానంలో నిలిచారు. మిగిలిన ఇద్దరిలో డెన్మార్క్‌కి చెందిన క్రిస్టియన్ కెటెల్ థామ్‌సెన్, స్విట్జర్లాండ్‌కు చెందిన థామస్ జోర్డాన్ ఉన్నారు. గవర్నర్ శక్తికాంత దాస్‌ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో వరుసగా రెండవ సంవత్సరం A+ గ్రేడ్‌ అవార్డును అందుకున్నారని ఆర్బీఐ ‘ఎక్స్‌’లో పేర్కొంది.

యూఎస్‌లోని వాషింగ్టన్ డీసీలో శక్తికాంత దాస్‌కు గ్లోబల్ ఫైనాన్స్ ఈ అవార్డును అందించింది. సంక్లిష్ట ఆర్థిక సవాళ్లలో భారతదేశ అపెక్స్ బ్యాంక్‌ను నడిపించడంలో గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అద్భుతమైన పనితీరు, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఈ సంస్థ గుర్తించింది.

గ్లోబల్ ఫైనాన్స్ సంస్థ 1994 నుండి సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్స్ ను ఏటా  విడుదల చేస్తుంది. యూరోపియన్ యూనియన్, ఈస్టర్న్ కరీబియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ స్టేట్స్‌, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ సహా దాదాపు 100 దేశాల కేంద్ర బ్యాంక్ గవర్నర్‌లకు ఇందులో ర్యాంకులు కేటాయిస్తారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)