Breaking News

ఆన్‌లైన్‌ పేమెంట్‌ మోసాలను అరికట్టేందుకు ముసాయిదా

Published on Thu, 08/01/2024 - 13:08

ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో జరిగే మోసాలను అరికట్టడానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్‌) ద్వారా జరిగే మోసాన్ని నిరోధించడానికి ఆర్‌బీఐ ముసాయిదాను రూపొందించింది. ఆరు నెలల పాటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించని వినియోగదారుల కేవైసీను అప్‌డేట్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. అలాగే పాస్‌వర్డ్‌, పిన్‌, సాఫ్ట్‌వేర్ టోకెన్‌లు, బయోమెట్రిక్‌లతో సహా డిజిటల్ చెల్లింపుల కోసం అడిషనల్‌ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఏఎఫ్‌ఏ) వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించేలా చూడాలని ప్రతిపాదించింది.

కార్డు లావాదేవీలు మినహా ఇతర డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు గతంలో కొన్ని అథెంటికేషన్లను యాక్సెస్‌ చేసినా వాటిని నిరుపయోగంగానే వదిలేస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఆన్‌లైన్‌ చెల్లింపులకు సంబంధించి ఎన్ని అథెంటికేషన్లను తీసుకొచ్చినా లావాదేవీలు జరపాలంటే మాత్రం ప్రాథమికంగా ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఓటీపీ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం రూ.5,000 లోపు చేసే కార్డ్‌, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్‌లు, బీమా ప్రీమియంలు, డిజిటల్ టోల్ చెల్లింపులు, రూ.7,500 లోపు చేసే ఆఫ్‌లైన్ చెల్లింపు లావాదేవీలను ఏఎఫ్‌ఏ నుంచి మినహాయించారు. అంతకుమించి లావాదేవీలు జరిపితే మాత్రం అథెంటికేషన్‌ ఉండాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్‌ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి!

కస్టమర్ల వివరాలు, లావాదేవీల్లో మరింత భద్రత పాటించాలనే ఉద్దేశంతోనే ఏఈపీఎస్‌ ముసాయిదాను రూపొందించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఆరు నెలల నుంచి ఎలాంటి లావాదేవీలు జరపని కస్టమర్ల కేవైసీ ప్రక్రియలో ముసాయిదాలోని ఆదేశాలు పాటించాలని తెలిపింది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు