ఎన్‌డీఏ సర్కార్‌పై బాంబు పేల్చిన ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌

Published on Wed, 09/06/2023 - 18:39

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)మాజీ డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య సంచలన విషయాలు ప్రకటించారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఆరు నెలల పదవీకాలం ఉండగానే 2019లో తన పదవికి రాజీనామా చేసిన ఆచార్య  తన పుస్తకంలో కొన్ని విషయాలను తొలిసారి బహిర్గతం చేశారు. ముఖ్యంగా  2018లో కేంద్రం, ఆర్‌బీఐ మధ్య బహిరంగ ఘర్షణకు దారితీసిన సంఘటనల వివరాలను పంచుకున్నారు. అంతేకాదు ప్రజా ప్రయోజనాల  దృష్ట్యా కొన్ని  విషయాలను మూసి తలుపుల వెనుక చర్చించడం కంటే బహిరంగంగా చర్చించడం  మేలని వ్యాఖ్యానించారు.

 2019 ఎన్నికలకు ముందు 2.-3 లక్షలు  అడిగిని ఎన్‌డీఏ సర్కార్‌
ప్రధానంగా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు ఖర్చు కోసం 2018లో బ్యాలెన్స్ షీట్ నుండి 2-3 లక్షల కోట్ల రూపాయలను ఉపసంహరించుకోవాలని ఎన్‌డిఎ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను (ఆర్‌బిఐ) తిరస్కరించిందని విరాల్ ఆచార్య వెల్లడించారు. మింట్ నివేదిక ప్రకారం 2020లో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించిన క్వెస్ట్ ఫర్ రిస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనే పుస్తకానికి  అప్‌డేట్‌  ప్రిల్యూడ్‌ బుక్‌లో దీనికి సంబంధి చాలా విషయాలను  ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

రికార్డు లాభాలు బదిలీ
గత ప్రభుత్వాల హయాంలో ఆర్‌బిఐ కి చెందిన నగుదును ప్రభుత్వ ఖాతాకు బదిలీకి సంబంధిచి బ్యూరోక్రసీ అండ్‌  ప్రభుత్వంలోని క్రియేటివ్‌ మైండ్స్‌ రూపొందించిన ప్రణాళిక  ప్రకారం ప్రతీ ఏడాది ఆర్‌బీఐ తన లాభంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి పంచిపెట్టే బదులు, నోట్ల రద్దుకు దారితీసిన మూడేళ్లలో, ప్రభుత్వానికి రికార్డు లాభాలను బదిలీ చేసిందని చార్య చెప్పారు. అలాగే ఆర్‌బిఐపై ఒత్తిడి తీసుకురావడానికి మరో కారణం డివెస్ట్‌మెంట్ రాబడులను పెంచడంలో ప్రభుత్వం వైఫల్యం అని పేర్కొన్నారు. అలాగే  2023లో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్‌ మెరుగుపడటాన్ని ప్రస్తావించిన ఆయన బ్యాడ్‌ లోన్స్‌ గుర్తింపు, దిద్దుబాటు చర్యల అమలు లక్ష్యంగా 2015లో రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించిన ఆస్తుల నాణ్యత సమీక్ష నిరంతరం అమలుతోనే  సాధ్యమైందన్నారు. 

ఆర్‌బీఐ సెక్షన్ -7  వివాదం
నిధుల బదిలీలో ఆర్‌బీఐ 80 ఏళ్ల చరిత్రలో సెక్షన్ 7ను సెక్షన్‌ను అమలు చేయడం అనూహ్యమైన చర్య అని ఆర్థిక నిపుణులు భావించారు. ఈ విభేదాలు, ఒత్తిడి నేపథ్యంలోనే  ఆప్పటి ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన మూడేళ్ల పదవీకాలం పూర్తి కావడానికి తొమ్మిది నెలల ముందు రాజీనామా  చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన వ్యక్తిగత కారణాలను ఉదహరించినప్పటికీ,  సెంట్రల్ బ్యాంక్ స్వయంప్రతిపత్తిపై  ప్రభుత్వం  ఒత్తిడి క్రమంలోనే  పటేల్‌ రాజీనామా అని అంతా భావించారు.

కాగా  2022లో  రూ.30,307 కోట్లతో పోలిస్తే FY23లో, సెంట్రల్ బ్యాంక్ ప్రభుత్వానికి  రూ. 87,416 కోట్ల డివిడెండ్‌ చెల్లించింది.  .2019లో ఆర్‌బీఐ అత్యధికంగా రూ.1.76 లక్షల కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఆర్‌బిఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుకు అనుగుణంగా, ఆర్‌బీఐ బ్యాలెన్స్ షీట్, ఎంత మూలధన నిల్వ ఎంత ఉండాలనేది నిర్ణయిస్తారు.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)