Breaking News

అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి

Published on Thu, 07/06/2023 - 06:24

ముంబై: రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన స్వల్ప, దీర్ఘ కాల చర్యలను ఆర్‌బీఐ నియమించిన ప్యానెల్‌ సిఫారసు చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) స్పెషల్‌ డ్రాయంగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) బాస్కెట్‌లో రూపాయిని చేర్చేందుకు కూడా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్‌డీఆర్‌ అనేది ఐఎంఎఫ్‌ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ రిజర్వ్‌ ఆస్తులకు సంబంధించినది. సభ్య దేశాల అధికారిక రిజర్వ్‌లకు మద్దతుగా దీన్ని వినియోగిస్తుంటుంది. ఈ రిజర్వ్‌ కరెన్సీలను సభ్య దేశాలు స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు.

అంటే ఎస్‌డీఆర్‌లు అనేవి సభ్య దేశాల నిధుల అవసరాలకు మద్దతుగా నిలుస్తుంది. ఎస్‌డీఆర్‌ బాస్కెట్‌లో ప్రస్తుతం యూఎస్‌ డాలర్, యూరో, చైనీస్‌ యువాన్, జపనీస్‌ యెన్, బ్రిటిష్‌ పౌండ్‌ మాత్రమే ఉన్నాయి. ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ రాథో అధ్యక్షతన గల ప్యానెల్‌ ఈ సిఫారసులను ఆర్‌బీఐకి సమరి్పంచింది. ముందుగా ద్వైపాక్షిక, బహుళపాక్షిక వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా రూపాయి, స్థానిక కరెన్సీల్లో ఇన్‌వాయిస్, చెల్లింపులు చేయాలని సిఫారసు చేసింది. భారత్‌లో, భారత్‌ బయట ఐఎన్‌ఆర్‌ ఖాతాలు తెరిచేలా ప్రోత్సాహించాలని కోరింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)