Breaking News

ఆర్‌బీఐ బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ

Published on Thu, 08/28/2025 - 08:43

బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఖాతాదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పొదుపు ఖాతాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు బ్యాంకింగ్ పద్ధతులకు పారదర్శకతను నిర్ధారించి, దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులను నేరుగా ప్రభావితం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

నిబంధనల్లోని ముఖ్యాంశాలు

వినియోగదారులకు బ్యాంకింగ్ అనుభవాన్ని సులభతరం చేయడం, బ్యాంకులను మరింత జవాబుదారీగా నిలిపేందుకు ఈ నిబంధనలు తోడ్పడుతాయని ఆర్‌బీఐ పేర్కొంది.

రోజువారీ వడ్డీ లెక్కింపు

పొదుపు డిపాజిట్లపై వడ్డీని నెలవారీ లేదా త్రైమాసికంగా కాకుండా ప్రతిరోజూ లెక్కించాలని ఆర్‌బీఐ తెలిపింది. ఇది తక్కువ డిపాజిట్లపై కస్టమర్లకు స్థిరంగా వడ్డీని సంపాదించేలా చేస్తుంది. ఇది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలపై స్పష్టత

మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే విధించే జరిమానాలను బ్యాంకులు స్పష్టంగా పేర్కొనాలి. ఇది హిడెన్‌ ఛార్జీలపై అనుమానాలను తొలగిస్తుంది. వినియోగదారులు వారి ఖాతాలకు సంబంధించి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇస్తుంది.

ప్రామాణిక ఉచిత ఏటీఎం లావాదేవీలు

ఖాతాదారులు అన్ని బ్యాంకుల్లో ఒకే నిర్దిష్ట ఉచిత ఏటీఎం లావాదేవీలకు అర్హులవుతారు. ఉచిత పరిమితి ముగిసిన తర్వాత లావాదేవీలు చేయాలంటే ప్రామాణిక రుసుము వర్తిస్తుంది. ప్రత్యేకించి వివిధ బ్యాంకుల్లో బహుళ ఖాతాలు కలిగి ఉన్నవారికి ఇది స్పష్టతనిస్తుంది.

అకౌంట్ పోర్టబిలిటీని సరళీకృతం

ఆర్‌బీఐ సేవింగ్స్ ఖాతా పోర్టబిలిటీని అమలు చేయాలని చెప్పింది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ మాదిరిగానే వినియోగదారులు తమ బ్యాంకు లేదా శాఖను ఇబ్బంది లేకుండా మార్చడానికి అనుమతిస్తుంది. ఇది ఖాతాదారుల సౌకర్యాన్ని పెంచుతుంది. మెరుగైన సేవలను అందించడానికి బ్యాంకుల మధ్య పోటీని పెంచుతుంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

కొత్త రూల్స్ ఎందుకు?

కొంతకాలంగా దేశంలో పొదుపు ఖాతాదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధాన మంత్రి జన​్‌ధన్‌ యోజన వంటి ప్రభుత్వ చొరవలతో ఖాతాల సంఖ్య అధికమైంది. అయితే వడ్డీ లెక్కింపు, మినిమమ్ బ్యాలెన్స్ అవసరాలు, ఏటీఎం వినియోగ పరిమితులు, అకౌంట్ ఛార్జీలు వంటి అంశాలను వివిధ బ్యాంకులు నిర్వహించే విధానంలోని అసమానతలున్నాయి. వీటిలో ఏకరూపకత తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిచింది. ఈ అసమానతలను పరిష్కరించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. దీనిని అన్ని బ్యాంకులు పాటించాలి.

ఇదీ చదవండి: మీరు ఆస్తిపరులా? లేదా ధనవంతులా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)