Breaking News

పర్సనల్‌ లోన్లు ఇక కష్టమే.. అమల్లోకి ఆర్బీఐ కొత్త రూల్‌

Published on Fri, 01/03/2025 - 20:44

ఎడాపెడా పర్సనల్‌ లోన్లు (personal loans) పొందడం ఇకపై కష్టతరం కానుంది. బ్యాంకులు (Banks), రుణ వితరణ సంస్థలు ప్రతి 15 రోజులకూ క్రెడిట్ బ్యూరో రికార్డ్‌లను అప్‌డేట్ చేయాలనే కొత్త నిబంధన అమలులోకి వస్తోంది. ఇది ఇప్పటివరకు నెల రోజులుగా ఉండేది. ఇప్పుడు ప్రతి రెండు వారాలకు రికార్డులు అప్‌డేట్ చేయనుండటంతో బహుళ రుణాలకు అర్హత పొందేవారి సంఖ్య తగ్గనుంది.

రిపోర్టింగ్ విరామాన్ని 15 రోజులకు తగ్గించాలని బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలకు గత ఆగస్టులోనే ఆర్బీఐ (RBI) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవస్థలను రూపొందించుకునేందుకు జనవరి 1 వరకు గడువు ఇచ్చింది. దీనివల్ల రుణదాతలు రుణగ్రహీతలకు సంబంధించి మెరుగైన రిస్క్‌ను అంచనా వేయవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది.

"ఈఎంఐలు (EMI) నెల అంతటా వివిధ తేదీలలో షెడ్యూల్ అయిఉంటాయి. నెలకు ఒకసారి రిపోర్టింగ్ సైకిల్ వల్ల డిఫాల్ట్‌లు లేదా చెల్లింపులను ప్రతిబింబించడంలో 40 రోజుల వరకు ఆలస్యం కావచ్చు.  ఫలితంగా క్రెడిట్ మూల్యాంకనాల కోసం గడువు ముగిసిన డేటా వస్తుంది. 15-రోజుకోసారి రిపోర్టింగ్ సైకిల్ ఈ జాప్యాలను గణనీయంగా తగ్గిస్తుంది" అని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సీఆర్‌ఐఎఫ్‌ హై మార్క్ ఛైర్మన్ సచిన్ సేథ్ అన్నారు.

తరచుగా చేసే డేటా అప్‌డేట్‌లు "ఎవర్‌గ్రీనింగ్"(పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేయడం) వంటి పద్ధతులను కూడా నిరోధిస్తాయని రుణదాతలు చెబుతున్నారు. రిపోర్టింగ్ సైకిల్‌ను సగానికి తగ్గించడం ద్వారా క్రెడిట్ బ్యూరోలు, రుణదాతలు మరింత విశ్వసనీయమైన డేటాను పొందుతారు. ఇది నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన రుణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)