Breaking News

అధిక వృద్ధి రేటు సాధ్యమే.. ఎలాంటి సవాళ్లు లేవు

Published on Mon, 07/28/2025 - 05:33

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) 6.5 శాతానికి పైన వృద్ధిని సాధించే విషయంలో ఎలాంటి సవాళ్లు లేవని ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యుడు నగేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో అన్ని ఆర్థిక వ్యవస్థల్లోకి భారత్‌ ఆశాకిరణంలా కొనసాగుతోందన్నారు. ‘‘నిజానికి మూడింట ఒకవంతుకు పైగా ఆర్థిక వ్యవస్థలు తీవ్రమైన రుణ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలు ఒత్తిళ్లను, అధిక ధరలు, ఆర్థిక మందగమనంతో సతమతం అవుతున్నాయి. 

కానీ, భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా దేశీ వినియోగం, దేశీ పెట్టుబడుల ఆధారితంగా నడుస్తోంది. ఎగుమతులపై ఆధారపడడం తక్కువ. కనుక 6.5 శాతం కంటే అధిక వృద్ధి సాధించే విషయంలో నాకు ఎలాంటి సవాళ్లు కనిపించడం లేదు’’అని కుమార్‌ వివరించారు. ఇదే వేగం కొనసాగుతుందంటూ రానున్న సంవత్సరాల్లో 7–7.5 శాతం వృద్ధి రేటును చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  మరిన్ని రేట్ల కోతకు అవకాశం ఉంటుందా? అన్న ప్రశ్నకు.. కేవలం ద్రవ్యోల్బణం నియంత్రణ కాకుండా ఇతర స్థూల ఆర్థిక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని నగేష్‌ కుమార్‌ బదులిచ్చారు.  

యూఎస్‌తో ఒప్పందం ప్రయోజనకరమే 
అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం సాకారమైతే కారి్మక ఆధారిత విస్తృతమైన అమెరికా మార్కెట్‌లో భారత్‌కు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని నగేష్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. మనదగ్గర పెద్ద ఎత్తున కారి్మక వనరులు ఉన్నందున భారత్‌ పోటీతత్వం పెరుగుతుందన్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ విషయంలో అమెరికాకు అవకాశాలు కలి్పంచడం పట్ల భారత్‌కు కొన్ని ఆందోళనలు ఉన్నట్టు ప్రస్తావించారు.
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)