Breaking News

ఈఎంఐలు తగ్గుతాయా? రేపటి నుంచే ఆర్బీఐ మీటింగ్‌..

Published on Mon, 02/05/2024 - 15:04

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ సమావేశం మంగళవారం (ఫిబ్రవరి 6) జరగబోతోంది. మధ్యంతర బడ్జెట్ ముగిసిన వెంటనే ఈ మీటింగ్‌ జరగుతోంది. ఇందులో ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుంది.. ప్రతి నెలా తాము చెల్లిస్తున్న లోన్ ఈఎంఐ (EMI)లు  ఏమైనా తగ్గుతాయా అని దేశవ్యాప్తంగా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు ఈ మీటింగ్‌ జరుగుతుంది. ఇందులో తీసుకున్న రేట్ల నిర్ణయాన్ని ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్  శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు. 

మళ్లీ యథాతథమే!
ఆర్‌బీఐ ఫిబ్రవరి మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష సమావేశంలో రెపో రేటు తగ్గింపు ఉండకపోవచ్చని, గత రేటు యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. రెపో రేటు అనేది ఆర్‌బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. గత డిసెంబర్‌లో జరిగిన సమావేశంలో ఆర్‌బీఐ పాలసీ రెపో రేటును 6.5 శాతం యథాతథంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది.

తగ్గింపు అప్పుడే..
రానున్న ఆర్థిక సంవత్సరంలో మొదటి రెపో రేటు తగ్గింపు వచ్చే జూన్‌లో  ఉండవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్‌బీఐ చివరిసారిగా రెపో రేటును మార్చి వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సమావేశాలు జరిగినా రెపో రేట్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)