Breaking News

బజాజ్ ఫైనాన్స్‌కు ఆర్బీఐ ఉపశమనం

Published on Fri, 05/03/2024 - 07:47

బజాజ్ ఫైనాన్స్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉపశమనం కల్పించింది. బజాజ్ ఫైనాన్స్‌కు సంబంధించిన రెండు ఉత్పత్తులు ఈకామ్‌ (eCOM), ఆన్‌లైన్ డిజిటల్ ఇన్‌స్టా ఈఎంఐ (Insta EMI) కార్డ్‌పై ఉన్న ఆంక్షలను తక్షణమే తొలగించింది. ఈమేరకు కంపెనీ మే 2న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

ఈఎంఐ కార్డ్‌ల జారీతో సహా రెండు వ్యాపార విభాగాలలో రుణాల మంజూరు, పంపిణీని ఇప్పుడు పునఃప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. 2023 నవంబర్ 15న  బజాజ్ ఫైనాన్స్ లెండింగ్ ఉత్పత్తులైన ఈకామ్‌, ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్‌ కింద రుణాల మంజూరు, పంపిణీని తక్షణమే నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. తమ డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలు, నిబంధనలకు కంపెనీ కట్టుబడి ఉండకపోవడంతో ఆంక్షలు విధించింది.

ఆర్బీఐ గత సంవత్సరం తమ రెండు రుణ ఉత్పత్తులపై వ్యాపార పరిమితులను విధించిన తర్వాత అవసరమైన మార్పులు చేసినట్లు బజాజ్ ఫైనాన్స్ ఏప్రిల్ 25న  జనవరి-మార్చి ఫలితాలను ప్రకటిస్తూ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీన్ని అనుసరించి, ఆంక్షలను సమీక్షించాలని ఆర్బీఐని అభ్యర్థించింది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)