Breaking News

ఫెమా పెనాల్టీ ఫ్రేమ్‌వర్క్‌ను సడలించిన ఆర్‌బీఐ

Published on Thu, 04/24/2025 - 21:28

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) పెనాల్టీ నిబంధనలను సవరించింది. ఇందులో భాగంగా ఆర్‌బీఐ తాజాగా ఫెమా నిర్దిష్ట ఉల్లంఘనలకు జరిమానాలను రూ.2 లక్షలకు పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. ఇది విదేశీ మారకద్రవ్య లావాదేవీలతో సంబంధం ఉన్న వ్యక్తులు, వ్యాపారాలకు కీలకం కానుంది.

గతంలోని నిబంధనల ప్రకారం ఉల్లంఘనల మొత్తంలో కొంత శాతంగా ఈ జరిమానాలను వసూలు చేసేవారు. దీని స్థానంలో రూ.2 లక్షలు స్థిరమైన జరిమానా నిబంధనను తీసుకొచ్చారు. గతంలోని విధానం ద్వారా తరచుగా భారీ ఆర్థిక జరిమానాలు చెల్లించాల్సి వచ్చేది. ఫెమా పెనాల్టీ ఫ్రేమ్‌వర్క్‌ కింద లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) రాబడులు, ఎగుమతి కాలపరిమితిలో జాప్యం, అధిక విలువ కలిగిన షేర్లను బహుమతిగా ఇవ్వడం వంటి అంశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. పెనాల్టీలో భాగంగా ఫిక్స్‌డ్‌ క్యాప్‌ను ప్రవేశపెట్టడం ద్వారా జరిమానాల ప్రక్రియను సరళతరం చేసినట్లయిందని కొందరు భావిస్తున్నారు. ఇటువంటి నియంత్రణ ఉల్లంఘనల సమయంలో వ్యక్తులు, వ్యాపారాలు ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఆర్‌బీఐ ఈ మార్పులు చేసినట్లు చెప్పింది.

ఇదీ చదవండి: ‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’

ఈ చర్య వాటాదారులపై భారాన్ని తగ్గించి ఫెమా మార్గదర్శకాలను మరింత మెరుగ్గా పాటించేలా చేస్తుందని కొందరు చెబుతున్నారు. జరిమానాలు నిష్పాక్షికంగా ఉండేలా చూడటం ద్వారా దేశంలో మరింత స్నేహపూర్వక వ్యాపార వాతావరణాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)