Breaking News

ఆర్‌బీఐ కఠిన నిర్ణయం: రెండు బ్యాంకులకు జరిమానా

Published on Sat, 08/30/2025 - 14:45

నియమాలను పాటించడంలో విఫలమైన బ్యాంకులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు బ్యాంకులకు భారీ జరిమానాలు విధించిన ఆర్‌బీఐ.. తాజాగా బంధన్ బ్యాంక్, నాందేడ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు జరిమానా విధించింది.

ఆదేశాలను పాటించలేకపోవడం వల్ల బంధన్ బ్యాంక్‌కు రూ. 44.7 లక్షల జరిమానా విధించడం జరిగిందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ముఖ్యంగా కొంత మంది ఉద్యోగుల వేతనాలను కమిషన్ రూపంలో చెల్లించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. అంతే కాకుండా.. బ్యాంక్ కొన్ని ఖాతాల డేటాకు సంబంధించి బ్యాక్ ఎండ్ ద్వారా మాన్యువల్ జోక్యాన్ని నిర్వహించిందని.. సిస్టమ్‌లోని నిర్దిష్ట వినియోగదారు వివరాలతో యాక్సెస్ ఆడిట్ ట్రయల్స్/లాగ్‌లను సంగ్రహించలేదని తెలిపింది.

మహారాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న 'నాందేడ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌'కు ఆర్‌బీఐ రూ. 45వేలు జరిమానా విధించింది. కేవైసీ నిబంధనలను పాటించకపోవడం, అనుమానాస్పద లావాదేవీలను గుర్తించేటువంటి సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫైన్ విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

ఇదీ చదవండి: ట్రంప్ వ్యాఖ్యలకు గట్టి సమాధానం!..అంచనాలు మించిన భారత్ జీడీపీ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకులపై జరిమానాలు విధించినప్పటికీ, ఈ ప్రభావం కస్టమర్ల మీద ఉండదు. అయితే బ్యాంకు కార్యకలాపాలపై ఆంక్షలు విధించినప్పుడు లేదా లైసెన్స్ రద్దు చేసినప్పుడు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కస్టమర్లు.. నిలక్ష్యంగా వ్యవహరించే బ్యాంకులకు కొంత దూరంగా ఉండాలి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)