Breaking News

ఏటీఎం ఛార్జీల పెంపు.. మే 1 నుంచి..

Published on Mon, 03/24/2025 - 13:00

ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజుల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. ఆర్థిక లావాదేవీలకు రూ .2, ఆర్థికేతర లావాదేవీలకు రూ .1 ఛార్జీలను పెంచింది. మే 1 నుంచి అమల్లోకి రానున్న ఈ ఛార్జీల పెంపు పరిమిత ఏటీఎం నెట్‌వర్క్ ఉన్న చిన్న బ్యాంకులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

పెంచిన ఇంటర్‌ఛేంజ్ ఫీజులను కస్టమర్లకు బదిలీ చేయాలా వద్దా అనే దానిపై బ్యాంకులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ చివరికి భారాన్ని వినియోగదారులపైనే వేస్తారన్న చర్చ సాగుతోంది. గత పదేళ్లలో ఇంటర్ చేంజ్ ఫీజులను సవరించినప్పుడల్లా బ్యాంకులు ఆ భారాన్ని కస్టమర్లపైనే వేశాయి. ఈసారి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదని, బ్యాంకులు కస్టమర్లకు ఫీజులు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంటర్‌చేంజ్ ఫీజు అంటే..
ఏటీఎం ఇంటర్ చేంజ్ ఫీజు అనేది ఏటీఎం సేవలను ఉపయోగించడానికి ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు చెల్లించే ఛార్జీ. ఆర్బీఐ గతంలో 2021 జూన్‌లో ఇంటర్‌ఛేంజ్ ఫీజును సవరించింది. నగదు ఉపసంహరణ వంటి ఆర్థిక లావాదేవీలకు ఇంటర్ఛేంజ్ ఫీజును రూ.17 నుంచి రూ.19కి, బ్యాలెన్స్ ఎంక్వైరీలు వంటి ఆర్థికేతర లావాదేవీలకు ఇంటర్ఛేంజ్ ఫీజును రూ.6 నుంచి రూ.7కు పెంచారు.

ఇంటర్ఛేంజ్ ఫీజుల పెంపునకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) మార్చి 13న బ్యాంకులు, ఇతర వాటాదారులకు తెలియజేసింది. ఇంటర్ చేంజ్ ఫీజుల పెంపును అమలు చేసేందుకు ఎన్‌పీసీఐ ఆర్బీఐ అనుమతి కోరింది.

ప్రస్తుత ఫీజు విధానంలో కార్యకలాపాలు నడపడం ఆర్థికంగా కష్టంగా ఉన్న వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల విజ్ఞప్తుల మేరకు ఇంటర్ చేంజ్ ఫీజును పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మెట్రో ప్రాంతాల్లో ఒక బ్యాంకు ఖాతాదారు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఐదు లావాదేవీలు, నాన్ మెట్రో ప్రాంతాల్లో మూడు లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)