Breaking News

రేట్ల కోత ఎందుకో చెప్పిన ఆర్‌బీఐ గవర్నర్‌

Published on Sat, 06/21/2025 - 08:44

అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నడుమ సెంట్రల్‌ బ్యాంక్‌ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్న స్పష్టమైన సంకేతం ఇవ్వడానికే వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ సంయ్‌ మల్హోత్రా తెలిపారు. లిక్విడిటీ పరంగా స్పష్టతకు, వినియోగం, పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు వీలుగా రుణ వ్యయాలను తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యాలుగా పేర్కొన్నారు. 

ఆర్‌బీఐ గవర్నర్‌ అధ్యక్షతన గల ఆరుగురు సభ్యుల ఎంపీసీ ప్యానెల్‌ ఈ నెలారంభంలో రెపో, రివర్స్‌ రెపో రేట్ల కోత నిర్ణయాలు ప్రకటించడం తెలిసిందే. ఈ నెల 4 నుంచి 6 వరకు జరిగిన ఎంపీసీ సమావేశంలో చర్చించి, రికార్డు అయిన వివరాలు (మినిట్స్‌) విడుదలయ్యాయి. ఐదుగురు సభ్యులు 50 బేసిస్‌ పాయింట్ల మేర రేట్ల కోతకు అనుకూలంగా ఓటు వేశారు. సౌగత భట్టాచార్య మాత్రం 25 బేసిస్‌ పాయింట్లకు మొగ్గు చూపించారు.  

గత కొన్ని నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3 శాతం మేర తగ్గడం (2024 అక్టోబర్‌లో నమోదైన 6.2 శాతం నుంచి 2025 ఏప్రిల్‌ నెలలో 3.2 శాతానికి), వార్షికంగా ద్రవ్యోల్బణం 3.7 శాతానికి పరిమితం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో 50 బేసిస్‌ పాయింట్లకు అనుకూలంగా గవర్నర్‌ మల్హోత్రా మొగ్గు చూపించారు.  

ఇదీ చదవండి: ఫైనాన్షియల్‌ సెక్టార్‌పై మస్క్‌ కన్ను

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అస్థిరమైన రేట్ల కోత కంటే.. 50 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించడం విధానపరమైన స్పష్టతకు, వేగవంతమైన బదిలీకి వీలు కల్పిస్తుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ గుప్తా అభిప్రాయపడ్డారు. తటస్థ విధానానికి సైతం మద్దతు పలికారు.

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)