బ్యాంకుల్లో గవర్నెన్స్‌ లోపాలు

Published on Tue, 05/30/2023 - 04:21

ముంబై: కార్పొరేట్‌ గవర్నెన్స్‌కి సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకుల్లో వాటి అమలు తీరులో మాత్రం లోపాలు ఉన్నట్లు తేలిందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. వాటిని అధిగమించగలిగామని, లేకపోతే ఎంతో కొంత ఒడిదుడుకులు తలెత్తేవని ఆయన పేర్కొన్నారు.

‘కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, బ్యాంకింగ్‌ రంగంలో ఒడిదుడుకులకు దారి తీసేలా కొన్ని బ్యాంకుల్లో గవర్నెన్స్‌పరమైన లోపాలు బైటపడటం ఆందోళనకరమైన విషయం‘ అని బ్యాంక్‌ బోర్డుల డైరెక్టర్లతో సోమవారం జరిగిన సమావేశంలో దాస్‌ పేర్కొన్నారు. బ్యాంకుల బోర్డులు, యాజమాన్యాలు ఇలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.   

స్మార్ట్‌ మోసాలు..
మొండిపద్దులపరమైన ఒత్తిళ్లను దాచి పెట్టేందుకు, కృత్రిమంగా ఆర్థిక పనితీరును గొప్పగా చూపించుకునేందుకు బ్యాంకులు ‘స్మార్ట్‌ అకౌంటింగ్‌’ విధానాలను ఆశ్రయించడాన్ని దాస్‌ తీవ్రంగా తప్పు పట్టారు. ఇందుకోసం బ్యాంకులు పాటిస్తున్న విధానాలను ప్రస్తావించారు. ఖాతాల్లో మొండిబాకీల భారాన్ని తగ్గించుకునేందుకు ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు సందర్భాన్ని బట్టి తమ రుణాలను విక్రయించి, తిరిగి బైబ్యాక్‌ చేయడం .. రుణగ్రహీత చెల్లించాల్సిన రీపేమెంట్లను అంతర్గతంగా ఖాతాల్లో సర్దుబాటు చేయడంలాంటివి వీటిలో ఉన్నట్లు దాస్‌ పేర్కొన్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)