Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏం చేసింది.. ఆర్బీఐ చర్యలెందుకు?

Published on Sat, 07/12/2025 - 15:26

దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు  చేపట్టింది. రూ .4.88 లక్షలు జరిమానా విధించినట్లు ప్రకటించింది.  తన క్లయింట్‌కు టర్మ్ లోన్ మంజూరు చేసేటప్పుడు 'మాస్టర్ డైరెక్షన్ - ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా' నిబంధనలను విస్మరించిందని, అందుకు గానూ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) సెక్షన్ 11 (3) నిబంధనల ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

నిబంధనల ఉల్లంఘనలపై నిఆర్బీఐ షోకాజ్ నోటీసు జారీ చేయగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చిందని, మౌఖిక సమర్పణలు కూడా చేసిందని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. కేసు వాస్తవాలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పందనను పరిగణనలోకి తీసుకుని జరిమానా విధించాలని ఆర్బీఐ నిర్ణయించింది.

శ్రీరామ్ ఫైనాన్స్‌కూ జరిమానా 
డిజిటల్ లెండింగ్ సంబంధిత నిబంధనలను పాటించనందుకు బ్యాంకింగేతర ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్‌బీఎఫ్‌సీ) అయిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పైనా రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. ఆర్బీఐ జారీ చేసిన "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (డిజిటల్ లెండింగ్) ఆదేశాలు, 2025" లోని కొన్ని నిబంధనలను పాటించనందుకు ఆర్బీఐ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై రూ .2.70 లక్షల జరిమానా విధించింది.

2024 మార్చి 31 నాటికి శ్రీరామ్ ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆర్బీఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం, సంబంధిత ఉత్తరప్రత్యుత్తరాల ఆధారంగా, ఆ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు బ్యాంక్ తెలిపింది.

రుణగ్రహీతలు నేరుగా రుణ చెల్లింపులను కంపెనీ ఖాతాలో జమ చేయడానికి బదులుగా థర్డ్ పార్టీ ఖాతా ద్వారా రుణ చెల్లింపులను కంపెనీ మళ్లించిందని ఆర్బీఐ తన తనిఖీలో గుర్తించింది. దీంతో శ్రీరామ్ ఫైనాన్స్‌కు జరిమానా విధిస్తూ  ఉత్తర్వులు జారీ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)