Breaking News

మహేష్ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా

Published on Sat, 07/01/2023 - 19:21

హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీ మహేష్‌ అర్బన్‌ కోపరేటవ్‌ బ్యాంకుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) భారీ విధించింది. సైబర్ భద్రతను నిర్లక్ష్యం చేసినందుకు గానూ రూ. 65 లక్షల జరిమానా విధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

గతేడాది జనవరి 24న మహేష్ బ్యాంక్ సర్వర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఖాతాదారులకు సంబంధించిన రూ. 12.48 కోట్లను వివిధ ఖాతాలకు నైజీరియన్ ముఠా బదిలీ చేసుకుంది. బ్యాంకు ప్రతినిధుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

మహేష్ బ్యాంకు యాజమాన్యం సైబర్ భద్రతను పూర్తిగా గాలికొదిలేసినట్లు సైబర్ క్రైం పోలీసులు విచారణలో తేల్చారు. సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు సిబ్బందికి ఫిషింగ్ మెయిళ్లు పంపించి సర్వర్ లోకి చొరబడినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ వద్ద హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రస్తావించి ఆ బ్యాంకు లైసెన్సును రద్దు చేయాలని సూచించారు. అయితే లైసెన్స్‌ రద్దు న్యాయపరంగా వీలు కాకపోవడంతో ఆర్బీఐ మహేష్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. సైబర్ భద్రత లోపాల కారణంగా ఆర్బీఐ జరిమానా విధించడం దేశంలో ఇదే తొలిసారి అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

ఇదీ చదవండి: సైబర్‌ ఇన్సూరెన్స్‌ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ.. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)