Breaking News

రూ.2000 నోట్లు: ఆర్‌బీఐ గుడ్‌ న్యూస్‌

Published on Sat, 09/30/2023 - 17:17

Rs 2000 notes Deadline extended up to October 7 ఉపసంహరించుకున్న రూ. 2000 నోటు డిపాజిట్లకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. సెప్టెంబరు 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ గడువును అక్టోబరు 7 వరకు పెంచుతున్నట్టు శనివారం వెల్లడించింది. అంతేకాదు రూ.2000 నోట్లు  చట్ట బద్దంగా చలామణిలో ఉంటాయని కూడా వెల్లడించింది. ఈ  నేపథ్యంలో ఎలాంటి జాప్యం లేకుండా రూ.2000 నోట్లను డిపాజిట్ చేయాలని లేదా మార్చుకోవాలని ఆర్‌బీఐ ప్రజలను కోరింది.

RBI  సంచలన ప్రకటన
ఉపసంహరణ ప్రక్రియకు నిర్దేశించిన వ్యవధి ముగిసినందున, రూ. 2000 నోట్ల డిపాజిట్ / మార్పిడికి అవకాశాన్ని అక్టోబర్ 07, 2023 వరకు పొడిగించాలని నిర్ణయించాం అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని వెల్లడించింది.

వినియోగదారులు అక్టోబరు 8 తరువాత నుంచి ఈ నోట్లను 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు.
వ్యక్తులు, సంస్థలు 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను దేశంలోని తమ బ్యాంక్ ఖాతాలకు ఎంత మొత్తానికి అయినా జమ చేయవచ్చు.
► అంతేకాకుండా, దేశంలోని కస్టమర్లు భారతదేశంలోని వారి బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ కోసం 19 ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాల్లో దేనినైనా చిరునామాకు పంపి, ఇండియా పోస్ట్ ద్వారా రూ.2000 నోట్లను పంపవచ్చు అయితే ఈ క్రెడిట్ సంబంధిత ఆర్‌బీఐ / ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటుంది, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాల సమర్పించాలి.
► న్యాయస్థానాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లేదా దర్యాప్తు ప్రక్రియల్లో పాలుపంచుకున్న ఇతర పబ్లిక్ అథారిటీలు లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎటువంటి పరిమితి లేకుండా 19 ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలలో దేనిలోనైనా రూ.2000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు అని ఆర్‌బీఐ తెలిపింది. 

కాగా  క్లీన్-నోట్ విధానంలో  భాగంగా  మే 19న రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లు రూ.0.24 లక్షల కోట్లుగా ఉన్నాయని ఆర్‌బీఐ గత శుక్రవారం వెల్లడించింది. (లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ: గంటల్లోనే హాల్‌ సేల్‌, ధర ఎంతంటే?)

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)