Breaking News

ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్ల కోత..?

Published on Sat, 02/22/2025 - 14:59

ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే లక్ష్యంతో వ్యూహాత్మక మార్పులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రాబోయే రోజుల్లో మరింత వడ్డీరేట్ల కోతలను అమలు చేయాలని భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. దాంతో రాబోయే రోజుల్లో మరిన్ని వడ్డీరేట్ల కోతలుండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

2025 ఫిబ్రవరి 7న ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్‌ చేస్తూ 6.25 శాతానికి తగ్గించింది. దాదాపు ఐదేళ్లలో ఎంపీసీ తొలిసారి ఈ నిర్ణయం తీసుకుంది. సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది. వినియోగం, పెట్టుబడుల మందగమనంతో భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. రుణ వ్యయాన్ని తగ్గించడం ద్వారా, ఖర్చులు, పెట్టుబడులను ఉత్తేజపరిచేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటోంది. ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ క్రమంగా తగ్గుతుందని, ఆర్‌బీఐ లక్ష్యానికి అనుగుణంగా ఉందని ఎంపీసీ భావిస్తోంది.

ఇదీ చదవండి: ఫిబ్రవరిలో సవరించిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు..

అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం కూడా ఆర్‌బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేందుకు పలు కేంద్ర బ్యాంకులు అనుకూలమైన ద్రవ్య విధానాలను అవలంబిస్తున్నాయి. ఆర్‌బీఐ కూడా అదేబాటలో నడవాలని భావిస్తోంది. రెపో రేటు తగ్గింపు వల్ల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయని, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు వినియోగదారులకు చౌకగా లభిస్తాయని ఆర్‌బీఐ పేర్కొంది. ఇది వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)