Breaking News

ఏఐ ప్రయోజనాలకు మద్దతుగా నిలవాలి

Published on Tue, 01/02/2024 - 06:24

ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) ప్రయోజనాలను వినియోగించుకోవడానికి వీలుగా నియంత్రణపరమైన కార్యాచరణ మద్దతు అవసరమని, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థపై దీని దు్రష్పభావాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎం.రాజేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్‌ ఎకనమిక్‌ అసోసియేషన్‌ వార్షిక సదస్సుల్లో భాగంగా ఆయన మాట్లాడారు. ఏఐని ప్రతిపాదించే వారు సైతం ఇది భవిష్యత్తును మార్చేదిగా భావిస్తున్నట్టు చెప్పారు.

‘‘పలు బ్యంక్‌లు, నాన్‌ బ్యాంక్‌లు ఏఐతో ప్రయోగాలు చేస్తుండడాన్ని చూస్తున్నాం. కాకపోతే ఇదంతా బ్యాక్‌ ఆఫీస్‌ పనులకు సంబంధించే ఎక్కువగా ఉంటోంది’’అని చెప్పారు. నిబంధనల అమలుకు సంబంధించి, చెల్లింపులు లేదా లావాదేవీల్లో మనీలాండరింగ్‌ ప్రయత్నాలను గుర్తించేందుకు ఏఐని కొన్ని బ్యాంక్‌లు అమల్లో పెట్టినట్టు తెలిపారు. రుణ వితరణ నిర్ణయాలు, కస్టమర్‌ గుర్తింపునకు సంబంధించి కూడా కొనఇన సంస్థలు ఏఐ సొల్యూషన్లను వినియోగిస్తున్నట్టు రాజేశ్వరరావు చెప్పారు.

మార్పు స్వభావం, సామర్థ్యాల రీత్యా జెనరేటివ్‌ ఏఐ ఉత్పాదకత, ఉద్యోగులు, ఆదాయం పంపిణీపై బలమైన ప్రభావం చూపించగలదన్నారు. ఆర్థిక వ్యవస్థ, సమాజం, ఆదాయం పెంపు, మళ్లీ మళ్లీ చేయాల్సిన పనుల ఆటోమేషన్‌పై ఏఐ చూపించే ప్రభావాన్ని సైతం పేర్కొన్నారు. అదే సమయంలో ఏఐ నిరుద్యోగాన్ని పెంచుతుందన్న ఆందోళనలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఐటీ రంగం నుంచి ఈ తరహా ఆందోళనలు వస్తున్నాయంటూ, దీనిపై చర్చకు ఇప్పట్లో ముగింపు రాకపోవచ్చన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)