Breaking News

బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచనలు

Published on Sun, 07/06/2025 - 10:25

ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలకు చెక్‌ పెట్టే దిశగా టెలికం శాఖ (డాట్‌)రూపొందించిన ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌ రిస్క్‌ ఇండికేటర్‌ (ఎఫ్‌ఆర్‌ఐ) ప్లాట్‌ఫాంను ఉపయోగించుకోవాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్‌ బ్యాంక్‌ సూచించింది. మధ్యస్థ, అధిక, అత్యధిక ఆర్థిక మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్‌ నంబర్లను ఇది రియల్‌ టైమ్‌లో వర్గీకరిస్తుందని పేర్కొంది.

ఆర్‌బీఐ ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు డాట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం చెల్లింపులకు యూపీఐ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్‌ మోసాల బారిన పడకుండా కోట్ల మందిని ఈ సాంకేతికత కాపాడగలదని వివరించింది.

డాట్‌లో భాగమైన డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (డీఐయూ) ఈ ఏడాది మే నెలలో ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఐని ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, ఫోన్‌పే, పేటీఎ మొదలైన దిగ్గజ సంస్థలు ఉపయోగిస్తున్నాయి.

ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్, నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోరి్టంగ్‌ పోర్టల్, డాట్‌కు చెందిన చక్షు ప్లాట్‌ఫాంలతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే డేటా ఆధారంగా ఎఫ్‌ఆర్‌ఐ పని చేస్తుంది.  

బ్యాంకుల మెరుగైన పనితీరుతో పరపతి మెరుగు
గడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌లు మెరుగైన పనితీరు నమోదు చేయడం వాటి పరపతి ప్రొఫైల్‌కు, భవిష్యత్‌ వృద్ధికి అనుకూలమని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. నాలుగేళ్లలో తక్కువ రుణ వృద్ధి నమోదు అయినప్పటికీ.. మెరుగైన ఆస్తుల నాణ్యత, పటిష్టమైన నగదు నిల్వలు, స్థిరమైన లాభాలను చూపించినట్టు పేర్కొంది.

‘‘ఇక ముందూ స్థిరమైన పనితీరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడం, మిగులు నిల్వలతో నష్టాలను సర్దుబాటు చేసుకోగల సామర్థ్యం ఉండడం, గత సైకిల్‌తో పోల్చితే ఆర్థిక షాక్‌లను తట్టుకుని నిలబడే సామర్థ్యం.. ఇవన్నీ రేటెడ్‌ బ్యాంకుల స్టాండలోన్‌ రుణ పరపతికి సానుకూలం’’అని ఫిచ్‌ రేటింగ్స్‌ వివరించింది.

2025–26లో రుణ పరపతి పరంగా బ్యాంక్‌లు స్థిరమైన పనితీరు చూపిస్తాయని పేర్కొంది. 2024–25లో ప్రభుత్వ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.1.41 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 26 శాతం ఎక్కువ.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)