Breaking News

ఆ బ్యాంక్‌ ఖాతాల్లో రూ.లక్ష కోట్లు.. ఆర్బీఐ ఆదేశాలు

Published on Thu, 12/05/2024 - 09:04

ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇనాపరేటివ్‌గా మారిన ఖాతాల సంఖ్యను సత్వరమే తగ్గించుకోవాలని బ్యాంక్‌లను ఆర్‌బీఐ కోరింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇనాపరేటివ్‌ ఖాతాలకు సంబంధించి గణాంకాలను ప్రతీ త్రైమాసికానికి ఒకసారి ఆర్‌బీఐకి నివేదించాలని కోరింది.

ఈ తరహా ఇనాపరేటివ్‌ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నిధులు ఉండిపోవడం పట్ల ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని సమస్యల కారణంగా ఖాతాలు నిరుపయోగంగా లేదా స్తంభించిపోయినట్టు తమ తనిఖీల్లో తెలిసినట్టు వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని బ్యాంకుల్లో ఈ తరహా ఖాతాల సంఖ్య అధికంగా ఉండడం, వాటిల్లో నిధులు ఉండిపోవడాన్ని ఆర్‌బీఐ గుర్తించింది.

దీంతో వాటిని తగ్గించుకోవాలని, సులభంగా యాక్టివేట్‌ చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడాన్ని సైతం పరిశీలించాలని పేర్కొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023 చివరి నాటికి ఇనాపరేటివ్‌ ఖాతాలలో రూ. లక్ష కోట్లకు పైగా డిపాజిట్‌లు స్తంభించాయి. వీటిలో రూ. 42,270 కోట్లు అన్‌క్లెయిమ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.

ఇదీ చదవండి: ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా..?

ప్రభుత్వరంగ ఎస్‌బీఐ ఇప్పటికే ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడం గమనార్హం. ఇక కస్టమర్లకు సంబంధించి ఆధార్‌ అప్‌డేటెషన్‌ సేవలను సైతం అందించాలని, ఆధార్‌ ఆధారిత సేవలకు  వీలు కల్పించాలని బ్యాంక్‌లను ఆర్‌బీఐ కోరింది. ఇనాపరేటివ్‌ ఖాతాలను యాక్టివేట్‌ చేసుకునేందుకు కస్టమర్లు బ్యాంక్‌ శాఖలను సంప్రదించినప్పటికీ, పేరు ఇతర వివరాలు సరిపోకపోవడం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)