చిన్న బ్యాంకుల్లో దారుణంగా వడ్డీ రేట్లు

Published on Wed, 10/02/2024 - 12:40

ముంబై: కొన్ని స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు (ఎస్‌ఎఫ్‌బీలు) విపరీత పోకడలు పోతూ.. అట్టడుగు వర్గాలకు చెందిన రుణ గ్రహీతల నుంచి భారీ వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ స్వామినాథన్‌ వ్యాఖ్యానించారు. ముందస్తుగానే కొన్ని వాయిదాల మొత్తాన్ని రుణ గ్రహీతల నుంచి తీసుకుని, వాటిని రుణంలో సర్దుబాటు చేయడం లేదన్నారు. పైగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు.

వ్యాపార వృద్ధి కోసం స్థిరమైన, బాధ్యతాయుత వ్యాపార విధానాలను పాటించాలని స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లకు సూచించారు. ఎస్‌ఎఫ్‌బీలపై బెంగళూరులో ఆర్‌బీఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా స్వామినాథన్‌ మాట్లాడారు. కొన్ని ఎస్‌ఎఫ్‌బీల బోర్డులో కనీసం ఇద్దరు హోల్‌టైమ్‌ డైరెక్టర్లను కూడా లేకపోవడాన్ని ఆర్‌బీఐ గుర్తించినట్టు చెప్పారు. కేవలం ఒకే ఒక్క పూర్తి కాల డైరెక్టర్‌ కలిగి ఉండడం కొన్ని సందర్భాల్లో సమస్యలకు దారితీయవచ్చంటూ.. మరింత మంది హోల్‌టైమ్‌ డైరెక్టర్ల నియామకంపై దృష్టి పెట్టాలని సూచించారు.  

డిపాజిట్ల విషయంలో జాగ్రత్త.. 
అధిక వ్యయంతో కూడిన టర్మ్‌ డిపాజిట్లపై ఆధారపడడం లేదంటే కేవలం కొన్ని సంస్థల బల్క్‌ డిపాజిట్లపై ఆధారపడడం పట్ల ఎస్‌ఎఫ్‌బీలను స్వామినాథన్‌ హెచ్చరించారు. ఇలా ఏదో ఒక విభాగంలో ఎక్కువ డిపాజిట్లు తీసుకోవడం పట్ల ఉండే రిస్‌్కను మదింపు వేయాలని సూచించారు.

సామాజిక బాధ్యత..  
సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆర్థిక సేవల విస్తరణకు, యువ పారిశ్రామికవేత్తల సాకారానానికి ఎస్‌బీఎఫ్‌లు కీలక పాత్ర పోషించాలని స్వామినాథన్‌ సూచించారు. సమ్మిళిత వృద్ధి దేశ ఆర్థిక పురోగతికి ఎంతో అవసరమన్నారు. సమాజంలోని బలహీన వర్గాలకు అందుబాటు ధరలకే రుణాలను కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అందించేందుకు కృషి చేయాలని సూచించారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)