Breaking News

రూ.100, రూ.500 నోట్ల రద్దు!.. నిజమేనా?

Published on Sat, 02/14/2026 - 15:23

కేంద్ర ప్రభుత్వం 2016లో.. అప్పుడు వాడుకలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఆ తరువాత 2023లో రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రారంభించింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్‌బీఐకు చేరాల్సిన పెద్ద నోట్లు ఇంకా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.100, రూ.500 నోట్లలో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

డిజిటల్ చెల్లింపులు ఎంత పెరిగినప్పటికీ నోట్ల అవసరం కూడా ఉంది. ఇప్పటికీ రిటైల్ మార్కెట్లలో, గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న వ్యాపారాల్లో కరెన్సీ నోట్లు కీలకంగా మారాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న 100, 500 రూపాయల నోట్లలో మార్పులు చేయనుంది. ఈ మార్పులలో వాటర్‌మార్క్‌లు, మైక్రోప్రింటింగ్, మెరుగైన ఇంక్ వంటివి ఉన్నాయి.

నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నోట్లలో మరింత మెరుగైన భద్రతను పెంచడానికి రిజర్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆర్‌బీఐ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళా ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లలో ఏమైనా మార్పులు చేస్తే.. పాత నోట్లు రద్దు అవుతాయా? అనేది ఇప్పుడొక ప్రశ్నగా మిగిలింది.

కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. పాత నోట్లు కూడా చలామణిలో ఉంటాయని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు సైతం తమ కరెన్సీలను మెరుగు పరుస్తున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వాట్సాప్ బ్యాన్ చేయడానికే ప్రయత్నం?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)