Breaking News

ఖాతాదారులకు గట్టి షాక్.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్‌బీఐ!

Published on Thu, 07/20/2023 - 12:22

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక బ్యాంకుల బ్యాంకింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న 'యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్' లిమిటెడ్ బిజ్నోర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, 'యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బిజ్నోర్' వద్ద తగినంత మూల ధనం లేని కారణంగా లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్లు జులై 19న ప్రకటించింది. ఆ రోజు బ్యాంక్ సమయం ముగిసే సమయానికి కార్యకలాపాలు నిర్వర్తించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

బ్యాంకు ప్రస్తుతం డిపాజిటర్లకు డబ్బు ఇచ్చే పరిస్థితిలో లేదని ఆర్‌బీఐ తెలిపింది. ఈ సమయంలో కస్టమర్లు తప్పకుండా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. కావున బ్యాంకింగ్ కార్యకలాపాలకు అనుమతిస్తే కస్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం లేదని సంబంధిత సంస్థ నివేదించింది. కాగా RBI ఈ బ్యాంకులో ఎవరూ డిపాజిట్ చేయకూడదని సూచించింది.

(ఇదీ చదవండి: భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ బంద్.. ఇక వారికి మాత్రమే!)

బ్యాంక్ అందించిన డేటా ప్రకారం.. ఇప్పటికి 99.98 శాతం మంది కస్టమర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి తమ పూర్తి మొత్తం తీసుకునే అవకాశం ఉంది. కావున డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవకాశం లేదు. ఆర్‌బీఐ గత ఏప్రిల్ నుంచి గత మార్చి వరకు 9 కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్లు తెలిసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)