Breaking News

మరో బ్యాంకు లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ.. కారణం ఇదే!

Published on Sat, 09/30/2023 - 16:15

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది, మరి కొన్ని బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసే దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఈ వరుసలో తాజాగా 'లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్' చేరింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆర్‌బీఐ ఉత్తరప్రదేశ్‌లోని కోఆపరేటివ్ కమిషనర్ & రిజిస్ట్రార్‌ను కూడా ఈ బ్యాంకును మూసివేయడానికి కావాల్సిన ఉత్తర్వు జారీ చేయాలని, సహకార బ్యాంకుకు లిక్విడేటర్‌ను నియమించాలని వెల్లడించినట్లు సమాచారం. బ్యాంకు దివాళా తీసిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ వద్ద తగిన మూలధనం లేకపోవడమే కాకుండా.. ఆదాయ అవకాశాలు కూడా లేకపోవడంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాల అనుమతిని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే లిక్విడేషన్ మీద ప్రతి డిపాజిటర్, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని రూ. 5 లక్షల వరకు పొందేందుకు అర్హులు.

ఇదీ చదవండి: 19 ఏళ్లనాటి కల.. ఇప్పుడు నిజమైంది.. ఈజ్‌మైట్రిప్‌ కో-ఫౌండర్

బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం, 99.53 శాతం డిపాజిటర్లు డిఐసిజిసి నుంచి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు అని ఆర్‌బీఐ తెలిపింది. మొత్తం మీద ఇకపై లక్నో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎలాంటి వ్యాపార లావాదేవీలు, బ్యాంకింగ్ కార్యకాలపు నిరవహించడం పూర్తిగా నిషేధం. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)