Breaking News

ఇక ఈ 2 బ్యాంక్‌లు కనిపించవు..లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్‌బీఐ!

Published on Wed, 07/12/2023 - 12:13

బ్యాంక్‌ ఖాతాదారులకు ముఖ్య గమనిక. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు బ్యాంక్‌ల వద్ద తగినంత మొత్తంలో నిధులు లేవని రెండు బ్యాంక్‌ల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

కర్ణాటక రాష్ట్రం కర్ణాటకలోని తమకూరులో సేవలందిస్తున్న శ్రీ శారదా మహిళా కో- ఆపరేటీవ్‌ బ్యాంక్‌, మహారాష్ట్రలోని సతారా జిల్లాలో హరిహరేశ్వర్ సహకార బ్యాంక్‌లు కస్టమర్లకు బ్యాంకింగ్‌ సేవల్ని అందిస్తున్నాయి. అయితే, కార్యకలాపాల కోసం ఈ రెండు బ్యాంక్‌ల వద్ద తగినంత మొత్తం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాము తీసుకున్న నిర్ణయంతో జులై 11 నుంచి ఆ రెండు బ్యాంక్‌లు మూత పడినట్లే ఆర్‌బీఐ పేర్కొంది. 

ఖాతా దారుల సొమ్ము వెనక్కి
ఆర్‌బీఐ ఆదేశాలతో ఖాతాదారులు డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని హరిహరేశ్వర్ సహకరి బ్యాంక్‌ 99.96 శాతం, శ్రీ శారద మహిళా కో-ఆపరేటీవ్‌ బ్యాంక్‌ 97.82 శాతం పొదుపు మొత్తాన్ని డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌, క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ)లు అందించినట్లు ఆర్‌బీఐ చేసిన అధికార ప్రకటనలో పేర్కొంది. ​

►ప్రతి డిపాజిటర్ డీఐసీజీసీ నుండి రూ. 5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులేనని తెలిపింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక స్థితి ఉన్న బ్యాంకులు తమ ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించలేవని పేర్కొంది.

►మార్చి 8, 2023 నాటికి, బ్యాంకు యొక్క మొత్తం బీమా డిపాజిట్లలో డీఐసీజీసీ ఇప్పటికే రూ.57.24 కోట్లను చెల్లించింది.

►జూన్ 12, 2023 నాటికి, శ్రీ శారద మహిళా కో-ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లకు మొత్తం బీమా చేసిన డిపాజిట్లలో రూ.15.06 కోట్లను చెల్లించింది. 

►మహారాష్ట్రలోని సహకార కమీషనర్ అండ్‌ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్‌ బ్యాంకును మూసివేయడానికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్‌బీఐ సూచించింది. 

చదవండి : సామాన్యులకు భారీ ఊరట?..ఇంటికే వచ్చి రూ. 2వేల నోట్లను తీసుకెళ్తారట!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)