Breaking News

బ్యాంకులకు ఆర్‌బీఐ సూచనలు

Published on Wed, 01/29/2025 - 21:58

పెరుగుతున్న డిజిటల్‌ మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు పటిష్ట, క్రియాశీలక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా (Sanjay Malhotra) కోరారు. అలాగే నష్టాలను తగ్గించడానికి థర్డ్‌–పార్టీ సర్వీస్‌ ప్రొవైడర్లపై పర్యవేక్షణను మెరుగుపరచాలని సూచించారు.

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం.రాజేశ్వర్‌ రావు, టి.రబి శంకర్, జె.స్వామినాథన్‌తో కలిసి ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల ఎండీలు, సీఈఓలతో ఆయన సమావేశమయ్యారు. డిజిటల్‌ మోసాల పెరుగుదలపై మల్హోత్రా ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.

డిసెంబరులో శక్తికాంత దాస్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా బ్యాంకులతో నిర్వహించిన మొదటి సమావేశం ఇది. ఆర్బీఐ తన పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల ఉన్నతాధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తుంటుంది.

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేసిన సంజయ్‌ మల్హోత్రా ఆర్బీఐ 26వ గవర్నర్‌గా గత డిసెంబర్‌ 11న బాధ్యతలు చేపట్టారు. గత గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పదవీకాలం ముగియడం ఆయన స్థానంలోకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్‌ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మూడేళ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)