Breaking News

కోటక్ మహీంద్రా బ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈవోగా దీపక్ గుప్తా

Published on Fri, 09/08/2023 - 22:26

ఉదయ్ కోటక్ రాజీనామా తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా దీపక్ గుప్తా (Dipak Gupta) నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ బీఎస్‌ఈ (BSE) ఫైలింగ్‌లో తెలిపినట్లుగా 2023 సెప్టెంబర్ 2 నుంచి రెండు నెలల కాలానికి గుప్తా నియామకాన్ని ఆర్బీఐ (RBI) ఆమోదిస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ తాత్కాలిక పదవీకాలం ముగిసేలోపు బ్యాంకు పూర్తికాల ఎండీని ఆర్‌బీఐ నిర్ణయిస్తుందని భావిస్తున్నారు.

ఉదయ్ కోటక్ తన పదవీ కాలానికి దాదాపు నాలుగు నెలల ముందే సెప్టెంబర్ 1న బ్యాంక్ ఎండీ, సీఈవో పదవి నుంచి వైదొలిగారు. మధ్యంతర ఏర్పాటుగా దాని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గుప్తా.. ఆర్బీఐ పేర్కొన్న రెండు నెలల పాటు ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తారు.

(Uday Kotak: బ్యాట్స్‌మన్ టు బిజినెస్‌మన్‌.. రిచెస్ట్‌ బ్యాంకర్‌ గురించిన ఆసక్తికర విషయాలు)

ఎండీ పదవీకాలాన్ని 15 సంవత్సరాలకు పరిమితం చేసే రెగ్యులేటరీ ఆదేశం ప్రకారం.. బ్యాంక్ బోర్డు ఈ సంవత్సరం ప్రారంభంలో ఉదయ్ కోటక్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించాలని నిర్ణయించింది. 

(వ్యాల్యూ అంటే ఇదీ.. ఆ రూ.10 వేలు ఇప్పుడు రూ.300 కోట్లు!)

బ్యాంక్‌లో 26 శాతం హోల్డింగ్ ఉన్న  ఉదయ్‌ కోటక్.. ఎండీ, సీఈవో పదవికి రాజీనామా చేసిన తర్వాత నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మారారు. ఆయన 2004లో బ్యాంక్ ప్రారంభమైనప్పటి నుంచి ఎండీగా ఉన్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ అయిన 64 ఏళ్ల ఉదయ్‌ కోటక్.. దేశంలోనే అత్యంత సంపన్న బ్యాంకర్. బ్యాంక్‌లో 26 శాతం వాటా కలిగి ఉన్నారు. సెప్టెంబరు 1 నాటికి ఆయన వాటా విలువ రూ. 3.5 లక్షల కోట్లు.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)