Breaking News

రూపాయికి ఆర్‌బీఐ టానిక్‌

Published on Sat, 01/25/2025 - 04:01

అంతర్జాతీయంగా రూపాయి వాడకాన్ని ప్రాచుర్యంలోకి తేవడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా సీమాంతర లావాదేవీలను రూపాయి మారకంలో నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. భారతీయ అదీకృత డీలర్‌ (ఏడీ) బ్యాంకుల విదేశీ శాఖల్లో, ప్రవాస భారతీయులు (ఎన్నారై) రూపీ అకౌంట్లను తెరిచేందుకు అవకాశం కల్పించింది.

 ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు సీమాంతర లావాదేవీలను సులభతరం చేయడానికి తాజా నిబంధనలు ఉపయోగపడగలవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి గత కొన్నాళ్లుగా దీని వెనుక గణనీయంగానే కసరత్తు జరుగుతోంది.  అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా సహా ఇతర దేశాలతో వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో సెటిల్‌ చేసుకునేందుకు వీలుగా, భారతీయ ఏడీ బ్యాంకుల్లో, ప్రత్యేక రూపీ అకౌంట్లను తెరిచేందుకు విదేశీ బ్యాంకులకు 2022లో ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. 

ఆ తర్వాత అంతర్జాతీయ ద్రవ్య నిధి, స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ బాస్కెట్‌లో చేర్చడం సహా రూపాయిని అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు అనుసరించతగిన మార్గదర్శ ప్రణాళికను సూచిస్తూ 2023లో ఆర్‌బీఐ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. ద్వైపాక్షిక, బహుళపాక్షిక వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలోనూ, స్థానిక కరెన్సీల్లోనూ సెటిల్‌ చేసుకోవచ్చని సిఫార్సు చేసింది. అలాగే, ఎన్నారైలకి రూపాయి మారకం ఖాతాలను తెరిచేందుకు వీలు కల్పించాలని సూచించింది. తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌ వీటన్నింటికి కొనసాగింపుగానే భావించవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.   

బ్యాంకర్లు ఏమంటారంటే.. 
ఈ నిబంధనల ప్రధాన లక్ష్యం.. అంతర్జాతీయంగా వాణిజ్యంలో రూపాయి వాడకాన్ని ప్రోత్సహించడమే అయినప్పటికీ, రూపాయి నాన్‌–కన్వర్టబుల్‌ కరెన్సీ కావడం వల్ల ఎక్కువగా లావాదేవీలు జరగకపోవచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తు తానికి వాణిజ్య లావాదేవీల కోసం.. అది కూడా యూఏఈ, తదితర దేశాల్లో 
మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.   

రూపాయి మారకంలో సీమాంతర చెల్లింపులు.. 
ఉదాహరణకు అమెరికాలో ఉంటున్న ఎన్నారై న్యూయార్క్‌లోని ఏడీ బ్యాంకు శాఖలో రూపీ ఖాతా తెరవొచ్చు. ఎగుమతులకి సంబంధించి వచి్చన ఆదాయాలను జమ చేసుకునేందుకు, దిగుమతి చేసుకున్న వాటికి చెల్లింపులు జరిపేందుకు ఈ ఖాతాలను ఉపయోగించుకోవచ్చు. అంటే.. భారత్‌కి చేసిన ఎగుమతులకు సంబంధించి వచ్చిన నిధులను ఆ అకౌంట్లో రూపాయి మారకంలో ఉంచుకోవచ్చు. భారత్‌లో ఉన్న వ్యక్తికి రూపాయి మారకంలో వ్యాపారపరమైన చెల్లింపులను జరిపేందుకు ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. 

  –సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)