Breaking News

‘పేదల బంగారం’పైనా లోన్లు.. ఎప్పటి నుంచంటే..

Published on Thu, 11/13/2025 - 16:54

ఆర్థికంగా అత్యవసరం తలెత్తినప్పుడు బంగారం ఉంటే అక్కరకువస్తుంది. బ్యాంకులు, ఇతర సంస్థల్లో తాకట్టు పెట్టి లోన్‌ పొందవచ్చు. ఈ కారణంతోనే చాలామంది మధ్య తరగతి వాళ్లు కూడా తమ స్తోమతకు మించి బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే మరి పేద, సామాన్య ప్రజల దగ్గర బంగారు ఆభరణాలు, వస్తువులు ఉండవు. ఏదో కొద్దో గొప్పో వెండి ఆభరణాలు, వస్తువులు ఉంటే ఉంటాయి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాటిపై లోన్‌లు ఎవరూ ఇవ్వరు కదా.. అని ఇన్నాళ్లు బాధపడిఉంటారు. ఇకపై ఆ బాధ అక్కర్లేదు. పేదల బంగారంగా భావించే వెండిపైనా బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు రుణాలు ఇవ్వనున్నాయి.

వెండిపై రుణాలకు సంబంధించి వాణిజ్య బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు రుణ మార్గదర్శకాలను ఆర్బీఐ సవరించింది. ఇందులో భాగంగా 2026 ఏప్రిల్ 1 నుండి వెండి ఆభరణాలు, వస్తువులు లేదా నాణేలను తాకట్టు పెట్టి రుణాలను పొందవచ్చు. పేదలు, సామాన్యులకు రుణ లభ్యతను మెరుగుపరచడానికి ఆర్బీఐ ఈ మార్పులు చేస్తోంది. అయితే ప్రాథమిక వెండి అంటే ఆభరణాలు, వినియోగ వస్తువులు కాకుండా వాణిజ్యానికి ఉపయోగించే వెండి బార్‌లపై మాత్రం ఈ రుణ సదుపాయం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

అయితే బంగారంపై ఇచ్చినట్లుగా దాటి రేటు ఆధారంగా అధిక మొత్తంలో రుణాలు వెండిపై ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని ఆర్బీఐ చెబుతోంది. వెండికి ఉన్న అధిక అస్థిరత, తక్కువ లిక్విడిటీ కారణంగా లోన్-టు-వాల్యూ నిష్పత్తులు, వడ్డీ రేట్లకు సంబంధించి వెండిపై రుణాలు బంగారు రుణాలతో పోల్చితే భిన్నంగా ఉండవచ్చు. అందువల్ల బ్యాంకులు, రుణ సంస్థలు వెండి-ఆధారిత రుణాలపై తక్కువ క్రెడిట్ పరిమితులను, కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లను నిర్ణయించవచ్చు. తాకట్టు పెట్టిన వెండి స్వచ్ఛత, నిల్వ, బీమా ఖర్చులు, తిరిగి చెల్లింపు షెడ్యూల్, జప్తు నిబంధనలతో సహా కారకాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలని రుణగ్రహీతలకు ఆర్బీఐ సూచించింది.

#

Tags : 1

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)