సీబీడీటీ కొత్త చైర్మన్‌గా రవి అగర్వాల్‌

Published on Sun, 06/30/2024 - 07:37

ఆదాయపు పన్ను శాఖ పరిపాలనా సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొత్త చైర్మన్‌గా 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి రవి అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్‌ 1986 బ్యాచ్ కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి నితిన్ గుప్తా పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది.

గుప్తా 2022 జూన్‌లో  సీబీడీటీ చీఫ్‌గా నియమితులయ్యారు. గత ఏడాది సెప్టెంబరులోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా జూన్ వరకు తొమ్మిది నెలల పొడిగింపు ఇచ్చారు. కొత్త సీబీడీటీ చీఫ్ ప్రస్తుతం బోర్డులో మెంబర్ (అడ్మినిస్ట్రేషన్)గా వ్యవహరిస్తున్నారు.

అగర్వాల్ 2025 జూన్ వరకు సీబీడీటీకి నేతృత్వం వహిస్తారని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అగర్వాల్ సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, నియామక నిబంధనల సడలింపులో తిరిగి నియమితులైన కేంద్ర ప్రభుత్వ అధికారులకు వర్తించే సాధారణ నిబంధనలు, షరతుల ప్రకారం వచ్చే ఏడాది జూన్ 30 వరకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పునర్నియామకం కొనసాగుతుందని ఆయన నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సీబీడీటీకి చైర్మన్ నేతృత్వం వహిస్తుండగా, ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ప్రగ్యా సహాయ్ సక్సేనా, హెచ్‌బీఎస్ గిల్, ప్రవీణ్ కుమార్, సంజయ్ కుమార్, సంజయ్ కుమార్ వర్మ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. జూన్ 30వ తేదీన వర్మ పదవీ విరమణ చేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)