Breaking News

రతన్‌ టాటా వీలునామా.. పెంపుడు శునకం ‘టిటో’కు వాటా!

Published on Fri, 10/25/2024 - 13:35

రతన్‌ టాటా మూగజీవాలపై ఎంత ప్రేమ చూపించేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన చివరి శ్వాస వరకూ తన పెంపుడు జంతువుల సంరక్షణకు శ్రద్ధ చూపిన రతన్‌ టాటా తన మరణం తర్వాత కూడా వాటి సంరక్షణకు లోటు రాకుండా ఏర్పాట్లు చేశారు.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం.. రతన్‌ టాటా రాసిన రూ.10,000 కోట్ల వీలునామాలో తన పెంపుడు జర్మన్ షెపర్డ్ శునకం ‘టిటో’ను చేర్చారు. ఈ శునకానికి "అపరిమిత" సంరక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించినట్లు సమాచారం. ఐదారేళ్ల క్రితం ఇదే పేరుతో ఇంతకు ముందున్న శునకం చనిపోయిన తర్వాత ఇప్పుడున్న ‘టిటో’ను ఆయన తెచ్చుకుని సంరక్షణ బాధ్యతలు చూసేవారు.

రతన్‌ టాటా దగ్గర చాలా ఏళ్లుగా వంటమనిషిగా పని చేస్తున్న రాజన్ షా ఇకపై ‘టిటో’ సంరక్షణ బాధ్యతలు చూసుకుంటారు. నివేదిక ప్రకారం.. టాటాతో మూడు దశాబ్ధాలుగా ఉంటున్న పనిమనిషి సుబ్బయ్యకు సంబంధించిన నిబంధనలను కూడా వీలునామాలో చేర్చారు.

రూ. 10,000 కోట్లకు పైగా  ఉన్న రతన్ టాటా ఆస్తులలో అలీబాగ్‌లోని 2,000 చదరపు అడుగుల బీచ్ బంగ్లా, ముంబైలోని జుహు తారా రోడ్‌లోని 2-అంతస్తుల ఇల్లు, రూ. 350 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టాటా సన్స్‌లో 0.83% వాటా ఉన్నాయి. దీన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ (RTEF)కి బదిలీ చేయనున్నారు.

10 వేల కోట్ల ఆస్తి..వీలునామాలో.. బయటపడ్డ షాకింగ్ సీక్రెట్

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)