Breaking News

సొంత హోటల్‌లో టాటా చేసిన పనికి ఫిదా!

Published on Fri, 10/11/2024 - 17:03

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ  ఐబీఎస్‌ సాఫ్ట్‌వేర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ వీకే మాథ్యూస్.. టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రతన్‌ టాటా వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియని ఆసక్తికర సంఘటలను పంచుకున్నారు.

రతన్‌ టాటా వ్యక్తిత్వంలో తనకు బాగా నచ్చేది ఆయన మానవత్వం అని, దీంతోపాటు ఆయనలో హాస్య చతురత కూడా ఉందని మాథ్యూస్‌ చెప్పారు. రతన్‌ టాటా ఉన్నారంటే ఎంతటి సీరియస్‌ వాతావరణాన్ని అయినా తన హాస్యంతో తేలికపరచగలరని పేర్కొన్నారు.

తానెవరో తెలియకుండా..
“యూఎస్ పర్యటనలో రతన్ టాటాతో కొంత సమయం గడిపే అవకాశం నాకు దొరికింది. ఆ సందర్భంగా జరిగిన రెండు సంఘటనలు నాకు ఎప్పుడూ గుర్తంటాయి” అని వాటి గురించి వెల్లడించారు మాథ్యూస్‌.

ఒక రోజు న్యూయార్క్‌లోని టాటా సొంత హోటల్‌లో వీరిద్దరూ అల్పాహారం చేశారు. అయితే రతన్‌ టాటా ఓనర్‌గా తన దర్పం ప్రదర్శించలేదని, అసలు తానెవరో అక్కడి సిబ్బందికి చెప్పలేదని మాథ్యూస్‌ గుర్తుచేసున్నారు. ఇదే ఆయన నిరాడంబరతకు నిదర్శనమని చెప్పారు.

“అదే రోజు తరువాత నేను, నా కుటుంబం మరొక రెస్టారెంట్‌కి వెళ్లగా అక్కడ రతన్‌ టాటా కనిపించారు. ఆయన బిల్లును స్వయంగా తన క్రెడిట్ కార్డ్‌తో చెల్లించడం చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. అది ఆయన ఎంత సింపుల్‌గా ఉంటారో తెలియజేసింది” అని మాథ్యూస్‌ గుర్తుచేసున్నారు.

మరో కోణం
ఇక రతన్‌ టాటాలో ఉన్న మరో కోణం ఆయన హాస్య చతురత. "తన ట్రేడ్‌మార్క్ హాస్యంతో రతన్ టాటా నన్ను, 'నేను నిన్ను వెంటాడుతున్నానా, లేక నువ్వు నన్ను వెంటాడుతున్నావా?' అన్నారు. ఆ తేలికైన వ్యాఖ్య పరిస్థితితో సంబంధం లేకుండా ఇతరులతో కనెక్ట్ అయ్యే ఆయన స్వభావాన్ని తెలియజేసింది” అని మాథ్యూస్ వివరించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)