Breaking News

రతన్ టాటా డ్రీమ్ కారుకి కొత్త హంగులు - ఈవీ విభాగంలో దూసుకెళ్తుందా?

Published on Fri, 07/14/2023 - 11:01

Ratan Tata Dream Car: ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి 'రతన్ టాటా' (Ratan Tata) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈయన కలలు కారుగా ప్రసిద్ధి చెందిన 'టాటా నానో' (Tata Nano) గత కొంతకాలంగా దేశీయ విఫణిలో ఉత్పత్తికి నోచుకోలేదు. అయితే ఇది మళ్ళీ ఇండియన్ మార్కెట్లో కొత్త హంగులతో విడుదలవుతుందని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నానో ఎలక్ట్రిక్ కారు..
నివేదికల ప్రకారం, టాటా కంపెనీ తన ఐకానిక్ కారు నానో గురించి ఎటువంటి భవిష్యత్ ప్రణాళికలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా అడుగెట్టే అవకాశం ఉంది. ప్రతి భారతీయుడు కారు కలిగి ఉండాలనే అభిప్రాయంతో రతన్ టాటా దీనికి ఊపిరి పోశారు. ఇప్పటి వరకు కూడా మనదేశంలో అతి తక్కువ ధరకు లభించే కారు టాటా నానో.

(ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్‌ రంగాన్నే షేక్‌ చేసిన ఇండియన్‌!)

ప్రారంభంలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ కారు క్రమంగా అమ్మకాల విషయంలో వెనుకపడిపోయింది. అయితే దీనిని ఎస్‌ఆర్‌కే (SRK) డిజైన్స్ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కారుగా తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇది పట్టణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ టాటా నానో ఎప్పుడు మార్కెట్లో విడుదలవుతుంది, దాని ధర ఏంటి అనే అధికారిక సమాచారం రానున్న రోజుల్లో తెలుస్తుంది.

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)