Breaking News

22న సెలవు.. బ్యాంకులకూ వర్తిస్తుందా?

Published on Fri, 01/19/2024 - 15:05

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఈనెల 22న (సోమవారం) అత్యంత వైభవోపేతంగా జరగబోతోంది. ఈ సందర్భంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజున సెలవు దినంగా ప్రకటించాయి. మరోవైపున కేంద్ర ప్రభుత్వం సైతం తమ ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలకు హాఫ్‌ హాలీడే ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. అయితే మరి బ్యాంకుల మాటేమిటి? బ్యాంకులన్నింటికీ ఈ హాఫ్‌ హాలీడే వర్తిస్తుందా అన్నది ఇక్కడ తెలుసుకుందాం.

ఎకనమిక్స్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. అయోధ్యలోని రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు, సంబంధిత పుణ్యకార్యాల్లో పాల్గొనేందుకు వీలుగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు ఆరోజున సెలవు ఇచ్చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యాహ్నం వరకూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు సెలవు ప్రకటించింది.

బ్యాంకులకు వర్తిస్తుందా?
ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలే కాబట్టి ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. జనవరి 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకూ ఆయా బ్యాంకులన్నీ మూతబడి ఉంటాయి. మధ్యాహ్నం 2.30 తర్వాత కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, గ్రామీణ బ్యాంకులకు కూడా వర్తిస్తుంది. ఇక ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే ఆర్బీఐ సెలవుల జాబితాలో జనవరి 22 లేదు కాబట్టి ఆరోజును పనిదినంగా పరిగణించాలి. ఈ నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకుల పనివేళ​ల్లో ఎలాంటి మార్పు ఉండదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)