Breaking News

నాస్కామ్‌ ప్రెసిడెంట్‌గా రాజేశ్‌ నంబియార్‌

Published on Thu, 08/22/2024 - 07:56

న్యూఢిల్లీ: నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్, సర్వీసెస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) నూతన ప్రెసిడెంట్‌గా కాగ్నిజెంట్‌ ఇండియా చైర్మన్‌ రాజేశ్‌ నంబియార్‌ నియమితులయ్యారు. దేబ్జానీ ఘోష్‌ పదవీకాలం పూర్తయిన తర్వాత నవంబర్‌ 2024లో నాస్కామ్‌ ప్రెసిడెంట్‌గా నంబియార్‌ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.

ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడైన ఆయన 2023లో నాస్కామ్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. టీసీఎస్, ఐబీఎం, సియెనా వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. కాగా, రాజేశ్‌ నంబియార్‌ కాగ్నిజెంట్‌ సీఎండీ పదవికి రాజీనామా చేశారు. గ్లోబల్‌ హెడ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్, ఇండియా సీఎండీగా రాజేశ్‌ వారియర్‌ను ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ నియమించుకుంది.

సెప్టెంబర్‌ 2 నుంచి గ్లోబల్‌ హెడ్‌గా, అక్టోబర్‌ 1 నుంచి సీఎండీగా బాధ్యతలు అందుకుంటారు. కాగ్నిజెంట్‌లో చేరక ముందు హెడ్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సర్వీసెస్, ఇన్ఫోసిస్‌ అమెరికాస్‌ ఈవీపీగా వారియర్‌ పనిచేశారు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఇన్సూరెన్స్, యాక్టివ్‌క్యూబ్స్‌ వంటి సంస్థల్లోనూ ఉద్యోగం చేశారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)