Breaking News

LIC పెట్టుబడుల వివాదం.. స్పందించిన రాజేష్ మెహతా

Published on Tue, 06/09/2026 - 02:36

ఇటీవల వివాదాలలో చిక్కుకున్న ఆభరణ వర్తక కంపెనీ రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ కౌంటర్లో బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) పెట్టుబడులపై వాడి, వేడి చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్‌ఐసీ ఆఫీస్‌ ఎక్కడుందో కూడా తనకు తెలియదని రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ చైర్మన్‌ రాజేష్‌ మెహతా తాజాగా వ్యాఖ్యానించారు.

కంపెనీలో ఎల్‌ఐసీ పెట్టుబడులు నిన్నటివి లేదా ఏడాది క్రితం చేసినవి కాదని పేర్కొన్నారు. సుమారు రెండు రెండు దశాబ్దాల కాలంలో చేపట్టిన పెట్టుబడులివని తెలియజేశారు. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా షేర్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. వెరసి కంపెనీ షేర్ల కొనుగోలు విషయంలో తానకుగానీ లేదా ఇతర ప్రమోటర్లకుగానీ ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు.

కంపెనీ ప్రమోటర్లు ఎవరూ ఎల్‌ఐసీకి వాటా విక్రయించలేదని వెల్లడించారు. ఇదేవిధంగా ఎల్‌ఐసీకి ఎలాంటి షేర్ల కేటాయింపునూ చేపట్టలేదని తెలియజేశారు. రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌లో బీమా దిగ్గజం చేపట్టిన పెట్టుబడులతో కంపెనీ లేదా ప్రమోటర్లకు ఎలాంటి లబ్ది చేకూరలేదని  స్పష్టం చేశారు. ఎల్‌ఐసీ పెట్టుబడి నిర్ణయాలలో తమకు ఏ విధమైన సంబంధమూలేదని, ఈ విషయాలు తెలియవని వివరించారు. పూర్తిగా వాణిజ్య ధృక్పథంతో ఎల్‌ఐసీ తీసుకున్న సొంత నిర్ణయాలేనని పేర్కొన్నారు.  

10.8 శాతం వాటా
ప్రస్తుతం రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌లో ఎల్‌ఐసీ వాటా 10.8 శాతంగా నమోదైంది. తొలి దర్యాప్తులో భాగంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కంపెనీ అక్రమ ఆదాయ నమోదుపై సీరియస్‌ అయ్యింది. రాజేష్‌ మెహతాను సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. ఈ అంశంలో సెబీ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ షేరు సోమవారం సైతం 5 శాతం పతనమై రూ. 94.5 వద్ద ఫ్రీజయ్యింది. మూడు రోజుల్లో 14 శాతం క్షీణించింది.

అయితే.. తనకున్న అవగాహన ద్వారా ఈ ధరలోనూ ఎల్‌ఐసీ నష్టపోయి ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ నష్టపోయి ఉంటే అవతలి పక్క మరొకరు లాభపడి ఉండాలని, ఇది సాధారణ పబ్లిక్‌ వాటాదారులేనని మెహతా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తొలిసారి మాట్లాడుతున్నానని, ఒకవేళ ఇప్పుడు ఎల్‌ఐసీ విక్రయిస్తుంటే కామన్‌ పబ్లిక్‌ కొనుగోలు చేస్తుంటారని, తద్వారా లబ్ది పొందుతారని, అంతేతప్ప కంపెనీ లేదా ప్రమోటర్‌ లాభపడరని వివరించారు. ఈ అంశాన్ని  వ్యతిరేకించేవారు సాధారణ వాటాదారులు లాభపడటాన్ని వ్యతిరేకిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)