Breaking News

వర్షాలతో సాగు సమృద్ధి

Published on Sat, 05/03/2025 - 07:40

ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే అధికంగా నమోదు కావచ్చంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వేసిన అంచనాలు వ్యవసాయ రంగానికి సానుకూలమని.. ఉత్పాదకత పెరుగుతుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌–రా) పేర్కొంది. దీనికితోడు వడ్డీ రేట్ల తగ్గింపు వినియోగానికి ఊతమిస్తాయని.. ప్రతీకార సుంకాలతో పడే ప్రభావాన్ని ఎదుర్కొని భారత్‌ బలంగా నిలబడగలదని అంచనా వేసింది. ఐఎండీ అంచనాలు కేవలం రైతులకే కాకుండా, ఆర్థిక వ్యవస్థకూ అనుకూలమేనని తెలిపింది. అయితే మొత్తం మీద వర్షపాతం ఎలా ఉంటుందన్న దానిపైనే ఈ ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది.

వాతావరణ మార్పులతో వర్షాల పరంగా ఎలాంటి ఊహించని షాక్‌లు లేకుండా సాధారణంగా ఉంటే మరో ఏడాది వ్యవసాయ రంగం స్థూల విలువ జోడింపు (జీవీఏ) 4 శాతం స్థాయిలో ఉంటుందని ఇండ్‌-రా అంచనా వేసింది. ‘2024 ఖరీఫ్, రబీ పరంగా మంచి సాగును చూశాం. 2025–26లోనూ రెండు సానుకూల పంట సీజన్లు, ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్షిత స్థాయికి దిగువన ఉండడం, ద్రవ్య పరపతి విధాన సరళీకరణ అన్నవి ప్రతీకార సుంకాల ప్రభావాన్ని భారత్‌ తట్టుకుని నిలిచేలా చేస్తాయి’ అని ఇండ్‌–రా ప్రతినిధి దేవేంద్ర కుమార్‌ పంత్‌ తెలిపారు. ఈ ఏడాది జూన్‌–సెప్టెంబర్‌ మధ్య కాలంలో వర్షాలు భౌగోళికంగా వివిధ ప్రాంతాల్లో ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంటుందని ఇండ్‌–రా తెలిపింది.  

ఇదీ చదవండి: భారత్‌–అమెరికా మధ్య డీల్‌..?

ఉపాధి కల్పనలో కీలక పాత్ర

2022–12 నాటికి జీడీపీ జీవీఏలో సాగు రంగం వాటా 18.5 శాతం ఉంటే, 2024–25లో 14.5 శాతానికి తగ్గినట్టు ఇండ్‌–రా తన నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ దేశ ఆరి్థక వ్యవస్థలో ఉపాధి కల్పన పరంగా కీలక భూమిక పోషిస్తున్నట్టు తెలిపింది. సాగు రంగం నుంచి ఉపాధి కల్పన వాటా 2018 మార్చి నాటికి 44.1 శాతంగా ఉంటే, 2025 మార్చి నాటికి 46.1 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. ఇది వినియోగ డిమాండ్‌పై, ముఖ్యంగా గ్రామీణ డిమాండ్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపింది.   

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)