Breaking News

కేంద్ర రైల్వే శాఖ బొద్దింకలు, ఎలుకల్ని పర్యవేక్షిస్తుందా? ప్రశ్నించిన ప్రయాణికుడు

Published on Fri, 04/07/2023 - 13:20

కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అహ్మదాబాద్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)ను ప్రారంభించింది. కంట్రోల్‌ సెంటర్‌ పని తీరును వివరిస్తూ వాటి ఫోటోల్ని విడుదల చేసింది. అయితే ఆ ఫోటోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ముఖ్యంగా రైలు ప్రయాణాల్లో తలెత్తుతున్న అసౌకర్యాలను ఎత్తిచూపుతున్నారు. ఓ నెటిజన్‌ ఓసీసీ వ్యవస్థపై వెటకారంగా స్పందించాడు. రైళ్లలో ఎలుకలు, బొద్దింకల్ని ఓసీసీ సెంటర్‌ పర్యవేక్షిస్తుందా? అని ప్రశ్నించాడు. అందుకు కేంద్ర రైల్వే శాఖ ఊహించని విధంగా స్పందించింది. 

రైల్వే మంత్రిత్వ శాఖ అహ్మదాబాద్‌లోని 1,506 కి.మీ వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణ పనులను ముమ్మరం చేస్తుంది. దేశవ్యాప్తంగా పారిశ్రామిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు నిర్మిస్తున్న కారిడార్‌ల ద్వారా అతివేగంతో ప్రయాణించే గూడ్స్‌ రైళ్ల కదలికల్ని పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది.  

అయితే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఓసీసీ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వాటిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అనేక మంది ఫేస్‌బుక్ యూజర్లు రైళ్లలో సౌకర్యాలను మెరుగుపరచడం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడంపై ప్రభుత్వాన్ని ప్రశంసించగా, మరికొందరు భారతదేశంలో రైలు ప్రయాణ అసౌకర్యాలను ఎత్తిచూపారు.

రైళ్లలో కనిపించే ఎలుకలు, బొద్దింకలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుందా? అంటూ ఓ యూజర్‌ ప్రశ్నించారు. దీంతో రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఊహించని విధంగా అతని ప్రయాణ వివరాలు, మొబైల్ నంబర్‌ చెప్పాలని కోరింది.మీ అభ్యంతరాలను నేరుగా railmadad.indianrailways.gov.inలో ఫిర్యాదు చేయోచ్చని లేదంటే సత్వర పరిష్కారం కోసం 139కి డయల్ చేయాలని పేర్కొంది. 

‘‘రాకెట్ సెంటర్ లాగా ఉంది. అద్భుతం. గో ఇండియా అని ఒక యూజర్ కామెంట్‌ చేశాడు. ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌.. ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ కమాండ్‌ సెంటర్‌’’తో పోల్చారు.  కాగా, వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీని, మహారాష్ట్రలోని నవీ ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్టుతో కలుపుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)