Breaking News

రైల్వే శాఖ కొత్త యాప్‌.. అన్ని సర్వీసులు ఒకే చోట..

Published on Sun, 02/02/2025 - 18:49

రైల్వే శాఖ ‘స్వరైల్‌’ (SwaRail app) అనే కొత్త మొబైల్‌ యాప్‌ను ప్రారంభించింది. పలు రకాల సేవలకు వన్-స్టాప్ సొల్యూషన్‌గా ఈ యాప్‌ను రూపొందించింది. స్వరైల్‌ యాప్‌ ప్రస్తుతానికి టెస్టింగ్‌ కోసం ప్లేస్టోర్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే (Railway) అధికారి ధ్రువీకరించారు.

“ఈ యాప్‌ను ప్రస్తుతానికికి 1,000 మంది వినియోగదారులు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోగలరు. వీరి నుంచి వచ్చే ప్రతిస్పందన,  అభిప్రాయాలను పరిగణించి ఆ తర్వాత, తదుపరి సూచనలు, వ్యాఖ్యల కోసం మరో 10,000 డౌన్‌లోడ్‌లకు అందుబాటులో ఉంచుతాం” అని రైల్వే బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

రిజర్వ్, అన్‌రిజర్వ్ టిక్కెట్ బుకింగ్‌లు, ప్లాట్‌ఫామ్,  పార్శిల్ బుకింగ్‌లు, రైలు ఎంక్వయిరీలు, పీఎన్‌ఆర్‌ తనిఖీలు,   రైల్‌మదాద్ ద్వారా అందించే సేవలు వంటివాటికి స్వరైల్‌ యాప్ సౌకర్యవంతమైన యాక్సెస్‌ను అందిస్తుంది.

“అతుకులు లేని క్లీన్‌ యూజర్‌  ఇంటర్‌ఫేస్ ద్వారా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ యాప్ ప్రధాన ప్రాధాన్యత. ఇది ఒకే చోట అన్ని సేవలను మిళితం చేయడమే కాకుండా, భారతీయ రైల్వే సేవల పూర్తి ప్యాకేజీని వినియోగదారులకు అందించడానికి అనేక సేవలను ఏకీకృతం చేస్తుంది” అని రైల్వే బోర్డులో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు.

రైల్వే మంత్రిత్వ శాఖ తరపున సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) తాజాగా బీటా పరీక్ష కోసం సూపర్ యాప్‌ను విడుదల చేసిందనని ఆయన తెలిపారు. వినియోగదారులు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి స్వరైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు